BigTV English

Devara: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే.. ?

Devara: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే.. ?

Devara:  మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్  జంటగా శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్  విలన్ గా నటిస్తున్నాడు. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు దేవర సెప్టెంబర్ 27  న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దేవర నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన చిత్ర బృందం.. వరుస ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలతో బిజీగా మారింది.  ఇక ప్రస్తుతం దేవర టీమ్ చెన్నై లో సందడి చేస్తుంది . ఎన్టీఆర్ తో పాటు కొరటాల  కూడా చెన్నై ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ఇకపోతే  దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 22  న హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరగనుందని తెలుస్తోంది.

Siva Koratala: కోటిన్నర వాచ్.. దేవర హిట్ కాకముందే ఎన్టీఆర్ గిఫ్ట్.. ?


పాన్ ఇండియా సినిమా  కాబట్టి ఎన్టీఆర్.. ఆ రేంజ్ లోనే ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. నేడు చెన్నై లో ప్రెస్ మీట్ అయ్యాక..  ఈ నెల  19 న చండీఘడ్ వెళ్తున్నట్లు సమాచారం. అక్కడ ప్రమోషన్స్ ను ముగించుకొని.. డైరెక్ట్ గా  నోవాటెల్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తాడని సమాచారం. అయితే నోవాటెల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని తెలియదంతో ఫ్యాన్స్  అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తారని, కడప, కర్నూల్ లాంటి ఏరియాల్లో ఓపెన్ గ్రౌండ్ లో దేవర కటౌట్స్  తో అంగరంగ  వైభవంగా చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, ఇలా క్లాస్ గా నోవాటెల్ లో చేయడం కొంచెం విచారంగా ఉందని చెప్పుకొస్తున్నారు. అది కాకుండా నోవాటెల్ లో అయితే ఎక్కువ మందికి  ప్రవేశం కూడా లేదు.  ఇలాంటి వేదికను ఫ్యాన్స్ అస్సలు ఊహించలేదే అని మాట్లాడుకుంటున్నారు.  ఇక దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరు వస్తున్నారు అనేది సస్పెన్స్ గా మారింది.  ఒక స్టార్ హీరో గెస్ట్ గా  వస్తున్నాడు అని టాక్ నడుస్తోంది.    మరి దేవర ప్రీ రిలీజ్ గెస్ట్ ఎవరు అనేది తెలియాలంటే  కాస్తా ఆగాల్సిందే.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×