BigTV English

Nagarjuna : ఆ సినిమా చేయనంటే నేనే ఒప్పించా.. నాగార్జున సినిమాపై వెంకట్ బోల్డ్ కామెంట్స్

Nagarjuna : ఆ సినిమా చేయనంటే నేనే ఒప్పించా.. నాగార్జున సినిమాపై వెంకట్ బోల్డ్ కామెంట్స్

Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఎన్నో సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్ లో బడా హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఈయన 99 సినిమాలు పూర్తి చేసి తన 100 వ సినిమాపై కసురత్తు చేస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున తమిళ్ స్టార్ ధనుష్ తో మల్టీ స్టార్ మూవీ లో నటిస్తున్నారు. అంతేకాక సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి సినిమాలోను నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు పై నాగార్జున ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక అక్కినేని వెంకట్ నాగార్జునకి సోదరుడు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వాహకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా అక్కినేని వెంకట్ తన సోదరుడు నాగార్జున పై, ఓ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా చేయను అంటే నేనే నాగార్జునను ఒప్పించాను. అని ఆ సినిమా విజయంలో నా పాత్ర ఉంది అంటూ బోల్డ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దాం..


ఆ సినిమా చేయనంటే నేనే ఒప్పించా..

అక్కినేని వెంకట్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో, నాగార్జున నటించిన సినిమా గురించి మాట్లాడుతూ.. నాగార్జున అన్నమయ్య సినిమా చేయడానికి మొదటి సంశయించాడు నేను కథ విని బాగుంది అని చెప్పాక ఓకే చేసి మూవీ లో నటించాడు. ఆ చిత్రం ఎంత బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిందో అందరికీ తెలిసిందే, ఈ సినిమాలో ఆయన ఎంతో కష్టపడ్డారు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అన్నమయ్య చిత్రంలో నాగార్జున మొదట ఒప్పుకోకపోవడానికి కారణం అందులో హీరో కామెడీ చేయాల్సి ఉంటుంది .అది నాగార్జునకు అస్సలు ఇష్టం ఉండదు కానీ కథ బాగుందని ఒప్పించాను. అని వెంకట్ తెలిపారు. ఇక ఈ సినిమానే కాక గతంలోనూ, కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా, మొదట చేయను అని నాగార్జున ఒప్పుకోలేదు. ఆయన నా దగ్గరికి వచ్చి కథ వినిపించాడు సినిమా మంచి హిట్ అవుతుంది చెయ్ అని చెప్పడంతో మూవీలో నటించాడు. ఆ సినిమా విజయవంతమైనది. ఆ సినిమా ఫుల్ కామెడీ మూవీ గా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక తర్వాత ఎన్నో సినిమాల్లో నాగార్జున కామెడీకి పెద్దపీట వేస్తూ సినిమాలు తీశారు. నిన్నే పెళ్ళాడుతా, హలో బ్రదర్, ఘరానా బుల్లోడు అల్లరి అల్లుడు, ఇలా ఎన్నో మూవీస్ ఆ తర్వాత నాగార్జున నటించారు. అని వెంకట్ తెలిపారు.


నాగార్జున సినిమాపై వెంకట్ బోల్డ్ కామెంట్స్..

శివ సినిమా గురించి ప్రస్తావించగా ఆ సినిమా చేయడం పెద్ద విషయం ఏం కాదు అలాంటి క్యారెక్టర్ లో సీరియస్ గా నటించమంటే ఏ హీరో అయినా చేస్తాడు. కానీ కామెడీ పండిస్తూ సినిమా చేయాలంటే హీరోకి పెద్ద టాస్కే, అందుకే నేను నాగార్జునతో కామెడీ కి సంబంధించిన సినిమాలు తీయడానికి ఒపించాను అని వెంకట్ తెలిపారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×