Akshay Kumar:ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) , కరణ్ సింగ్ త్యాగి (Karan Singh Tyagi) దర్శకత్వంలో ‘కేసరి 2’ సినిమాతో ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, శంకర్ నాయర్ (Shankar Nair) కీలక పాత్రలు పోషిస్తూ ఉండగా.. ‘ జలియన్ వాలాబాగ్’ దుర్ఘటన తర్వాత బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన న్యాయవాదిగా ఇందులో అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల అవ్వగా.. ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ కొత్త రాజకీయ వివాదాలకు తెరలేపింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా కొంతమంది.. కాంగ్రెస్ పార్టీకి చెందిన గొప్ప వ్యక్తులను ఇందులో నిర్లక్ష్యం చేశారని.. వారిలో శంకర్ నాయర్ పాత్ర కూడా ఒకటి అని భాజాపా నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ పోస్ట్ పెట్టారు.
నేను ఒక నటుడిని మాత్రమే – అక్షయ్ కుమార్
ఇక ఇలా వివాదం పెద్దదిగా మారుతున్న వేళ.. దీనిపై అక్షయ్ కుమార్ స్పందించారు. అక్షయ్ కుమార్ స్పందిస్తూ.. రాజకీయ నాయకులు ఈ సినిమాపై చేసే కామెంట్ల గురించి మాట్లాడాలనుకోవట్లేదు అంటూ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. “నేను చరిత్రకారుడిని కాదు. కేవలం నటుడిని మాత్రమే. ఈ సినిమాపై ఎవరెవరో చెప్పే మాటలను నేను వినదల్చుకోలేదు. మేము గొప్ప సినిమాను మాత్రమే ప్రజలకు అందించాలి అనుకుంటున్నాము. అలాగే ఈ చిత్రాన్ని ఒక పుస్తకం ఆధారంగానే తెరకెక్కిస్తున్నాము. ఇప్పటివరకు జలియన్ వాలాబాగ్ గురించి ఎన్నో కథలు విన్నాము. వాటన్నింటినీ తెలుసుకున్న తర్వాతేనే దీనిని రూపొందించాము. ముఖ్యంగా ఈ జలియన్ వాలాబాగ్ లో జరిగిన దుర్ఘటనకు మా తాతయ్య ప్రత్యక్ష సాక్షి . చిన్నప్పటి నుంచి ఆయన దీని గురించి మాకు ఎన్నో కథలు చెప్పారు. అందుకే వాటన్నింటినీ మేము దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాము. కరణ్ త్యాగి నాకు ఈ కథ చెప్పిన వెంటనే ఇందులో భాగం కావాలనుకుని నేను నటించడానికి ఒప్పుకున్నాను” అంటూ తెలిపారు అక్షయ్ కుమార్.
ఈ సినిమాను బ్రిటిష్ ప్రభుత్వం తప్పకుండా చూడాలి..
ఇక అలాగే ఈ జలియన్ వాలాబాగ్ లో జరిగిన విషాదం పై తెరకెక్కుతున్న ‘కేసరి చాప్టర్ 2’ సినిమాను బ్రిటిష్ ప్రభుత్వం కచ్చితంగా చూడాలి. మా ప్రభుత్వంతో పాటు కింగ్ చార్లెస్ కూడా ఈ సినిమాను చూసి వారు చేసిన తప్పేంటో తెలుసుకొని, కనీసం అప్పుడైనా పశ్చాతాపడాలి అంటూ అక్షయ్ కుమార్ తెలిపారు. అంతేకాదు ఈ సినిమా చూశాక కచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా తెలిపారు అక్షయ్ కుమార్. ఇక అక్షయ్ కుమార్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు ఈ విషయం రాజకీయంగానే కాకుండా అటు దేశాల మధ్య కూడా చెలరేగే అవకాశం ఉందనే వార్తలు ఊపందుకుంటున్నాయి..ఏది ఏమైనా అక్షయ్ కుమార్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు కారణమవుతున్నాయని చెప్పవచ్చు. మరి ఈ వివాదం ఇంకెంత వరకు వెళ్తుందో చూడాలి.