BigTV English

Woman Deadbody In Drainage: డ్రైనేజీలో మహిళ శవం.. ముక్కు పుడక ఆధారంగా హంతకుడిని పట్టుకున్న పోలీసులు

Woman Deadbody In Drainage: డ్రైనేజీలో మహిళ శవం.. ముక్కు పుడక ఆధారంగా హంతకుడిని పట్టుకున్న పోలీసులు

Woman Deadbody In Drainage| ఇటీవల జరిగిన కొన్ని నేర ఘటనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నేరస్తులలో ఎక్కువ శాతం సమాజంలో పరువుగల వారు లేదా సామాన్యులుగా జీవిస్తున్నవారే ఉండడం ఆందోళనకర విషయం. తాజాగా ఓ మహిళ శవం ఓ డ్రైనేజ్ లో లభించింది.అయితే ఆ మృతదేహం ఎవరిది? ఆమెను ఎవరు హత్య చేశారో తెలియక పోలీసులు అవస్థలు పడ్డారు. చివరకు శవం ముక్కులో ఉన్న ముక్కుపుడక సాయంతో మర్డర్ కేసుని పరిష్కరించారు.


వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ డ్రైనేజీలో నెల రోజుల క్రితం మహిళ మృతదేహం లభించింది. ఆ శవం ఒక బెడ్ షీట్ లో చుట్టేసి ఎవరో అక్కడ పడేశారు. శవం బరువు చూస్తే దాన్ని ఒకరు కాదు ఇద్దరు మోసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం.. శవం ముక్కులో ఉన్న ముక్కుపుడక తప్ప మరే ఆధారాలు లేవు. ఆ మహిళను ఎవరో తాడు గొంతు బిగించి హత్య చేశారు. పోలీసులు ఆ శవం ఎవరితో తెలుసుకోవడానికి ఆ ముక్కు పుడకను ఫొటో తీసి రాజధానిలోని అన్ని జువెలరీ షాపులకు పంపారు. చివరికి ఆ ముక్కుపుడక సౌత్ ఢిల్లీ లోని ఒక జువెలరీ షోరూం నుంచి కొనుగోలు చేసిందిగా తెలిసింది.

జువెలరీ షోరూంలో లభించిన రసీదుల ప్రకారం.. ఆ ముక్కుపుడక కొనుగోలు చేసిన వ్యక్తి సీమా సింగ్ అనే 47 ఏళ్ల మహిళ. ఆ మృతదేహం కూడా దాదాపు 45 ఏళ్ల మహిళదేనని పోస్ట్ మార్టం నివేదికలో ఉంది. దీంతో పోలీసులు నిర్ధారణ కోసం ముందుగా ఆ ముక్కు పుడక కొనుగోలు కోసం ఉపయోగించిన క్రెడిట్ కార్డు వివరాలని సేకరించారు. అక్కడి నుంచి సీమా సింగ్ అడ్రస్ తెలుసుకొని ఆమె ఇంటికి వెళ్లారు. అక్కడ సీమా సింగ్ భర్త అనిల్ కుమార్ తో పోలీసులు కలిశారు. పోలీసులు.. సీమా సింగ్ గురించి ఆరా తీయగా ఆమె తన తల్లిదండ్రులను కలిసేందుకు గుజరాత్ లోని ద్వారక నగరానికి వెళ్లిందని ఆయన తెలిపాడు. ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఆమె తన ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్లిందని చెప్పాడు. దీంతో పోలీసులకు అతనిపై అనుమానం కలిగింది.


పోలీసులు నిజం తెలుసుకోవడానికి ద్వారక వెళ్లారు. అక్కడ సీమా సింగ్ పుట్టింటికి వెళ్లగా.. ఆమె సోదరిని పోలీసులు కలిశారు. సీమా సింగ్ నెల రోజులుగా కనిపించలేదని.. చివరిసారిగా మార్చి నెల రెండో వారంలో ఆమెతో మాట్లాడానని చెప్పింది. సీమాసింగ్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. సీమా సింగ్ తన భర్తలో గొడవపడేదని.. ఆమె గొడవ పడి ఎక్కడికో వెళ్లిపోయిందని.. పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటే తమ అల్లుడు అందుకు అంగీకరించలేదని.. సీమా సింగ్ తనే తీసుకొస్తానని మాట ఇచ్చాడని చెప్పారు. పోలీసులు తమ వద్ద మృతదేహాన్ని గుర్తించడానికి వారిని పిలిచారు. సీమా సింగ్ కొడుకు, ఆమె తల్లిదండ్రులు ఆ శవం తమ కూతురిదేనని ధృవీకరించారు.

Also Read:  రోడ్డు ప్రమాదంలో గాయపడిన మూగజీవి.. కాపాడబోయి యువకుడు మృతి

పోలీసులు ఈ సమాచారంతో సీమా సింగ్ భర్తని అదుపులోకి తీసుకున్నారు. కానీ అతడి నుంచి సమాచారం సేకరించలేకపోయారు. అయితే అతని ఫోన్ డేటా నుంచి అతని ఇంట్లో పనిచేసే శివ శంకర్‌ ని కూడా అరెస్ట్ చేశారు. మార్చి 15న సీమా సింగ్ హత్య జరిగిన రోజు ఫోన్ లొకేషన్ ప్రకారం.. శివ శంకర్‌, అనిల్ కుమార్ ఒకే చోట ఉన్నట్లు తెలిసింది. దీంతో శివశంకర్ మొత్తం నిజం చెప్పేశాడు. సీమా సింగ్ కు మరో పురుషుడితో అక్రమ సంబంధం (Extra Marital Affair) ఉన్న విషయం ఆమె భర్త బిజినెస్ మెన్ అనిల్ కుమార్ కు తెలిసిపోయింది. దీంతో అనిల్ కుమార్ తన భార్య మార్చి 15 రాత్రి ఆమె గొంతుకు కేబుల్ బిగించి హత్య చేశాడు. ఆ తరువాత తన బాడీ గార్డు అయిన శివ శంకర్ సాయంతో శవాన్ని బెడ్ షీట్ లో చుట్టేసి ఢిల్లీ శివారు ప్రాంతాల్లో ఉన్న పెద్ద కాలువలో పడేశాడు.

ప్రస్తుతం అనిత్ కుమార్ పై హత్య (murder mystery) ఆరోపణలు, అతని బాడీ గార్డ్ శివ శంకర్‌ పై హత్యానేరాన్ని దాచేందుకు సాయం చేసిన నేరాల కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ పూర్తి చేస్తున్నారు.

Related News

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Big Stories

×