Kesari Chapter 2: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన, హిస్టారికల్ కోర్టు డ్రామా కేసరి చాప్టర్ 2. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే సుమారు 100 కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లు సాధించింది. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ బాలీవుడ్ లో ఏప్రిల్ 18న విడుదలై సెన్సేషన్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో మే 23న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఆ వివరాలు చూద్దాం..
కేసరి చాప్టర్ 2 తెలుగులో వచ్చేస్తుంది..
కేసరి చాప్టర్ 2 చిత్రం తెలుగు లో రానుంది. హిందీలో ఈ మూవీ కి వచ్చిన క్రేజ్ తో తెలుగు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేస్తూ రిలీజ్ డేట్ ని కూడా ఖరారు చేశారు. బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన జలియన్ వాలా బాగ్ మారణ హోమం బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ రూపొందింది. తాజాగా ఈ చిత్రం మే 23న రిలీజ్ కానున్నట్లు, మూవీ టీం ప్రకటించింది. ప్రముఖ సమస్థ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో ఈ చిత్రం విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. కేసరి చాప్టర్ 2 తో ప్రేక్షకులు పవర్ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని సురేష్ ప్రొడక్షన్ అందించబోతుంది. ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రియులు ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూద్దామా అన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.
అక్కడ సూపర్ హిట్ మూవీ ..ఇప్పుడు తెలుగు లో ..
ఏప్రిల్ 18న హిందీలో విడుదలైన ఈ చిత్రం ఎన్నో ప్రశంసలను అందుకుంది. గతంలో రానా ఈ చిత్రం మొదటి రివ్యూని అందిస్తూ, ఈ మూవీ తెలుగులో రిలీజ్ చేయడానికి సురేష్ ప్రొడక్షన్ ముందుంటుందని తెలిపారు. ఇప్పుడు రానా చెప్పినట్లు ఈ మూవీ తెలుగులో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై రానుంది. దాదాపు ఈ మూవీ 150 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఇప్పటివరకు ఈ మూవీ హిందీలో సుమారు 140 కోట్లకు పైగా వసూలను సాధించింది. ఇప్పటికీ సినిమా ఇంకా థియేటర్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. మరి కొన్ని రోజుల లో ప్రాఫిట్ జోన్ దాటి లాభాల బాటలో వెళ్లనుంది. ఇక 1919లో జలియన్ వాలా బాగ్ మారణకాండ అనంతరం జరిగిన కోర్టు కేసు నేపథ్యంలో అక్షయ్ కుమార్ న్యాయవాది సి. శంకరన్ నాయర్ పాత్రను పోషించగా, బ్రిటిష్ న్యాయవాదిగా అయన ప్రత్యర్థి పాత్రలో మాధవన్ నటించారు. నటి అనన్య పాండే జూనియర్ లాయర్ గా నటించింది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, మాధవన్ తో పాటు రెజీనా కసాండ్ర, సైమన్, అమిత్ సియాల్, ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి శశ్వంత్ సచిదేవ్, కవితా సేత్ – కనిష్క్ సేత్ సంగీతాన్ని అందించారు. ఇక తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యి ఎటువంటి సెన్సేషన్ రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
RAPO22 Movie Title : రామ్ లేటెస్ట్ మూవీ టైటిల్.. ఎవరి తాలూకానో తెలుసా గురూ.!?
https://www.instagram.com/stories/ranadaggubati/3632172336536669187?igsh=bGJ1Z3V0Z3FxZGxr