Bachhala Malli movie Trailer: అల్లరి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నరేష్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా హ్యాపీగా నవ్వుకోవచ్చు అంటూ థియేటర్ కి పరుగులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాస్తవానికి మాట్లాడుకుంటే థియేటర్ కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే గాని థియేటర్ వద్ద ప్రేక్షకులు కనిపించడం లేదు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన 30 రోజులకి ఓటీటీలోకి వచ్చేస్తుంది. అందుకే చాలా సినిమా థియేటర్స్ అన్ని కూడా కళ్యాణ మండపాలు అయిపోయాయి. ఏదేమైనా ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పడతారు అనడంలో అతిశయోక్తి లేదు. రీసెంట్ గా చాలా చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి.
వాస్తవానికి కమిటీ కుర్రాళ్లు సినిమాలో హీరోలు ఎవరికి తెలియదు. కానీ ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది ఆ సినిమాను ఆదరించారు, మంచి పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. అలానే ఆయ్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇక అల్లరి నరేష్ విషయానికి వస్తే ఒకప్పుడు నరేష్ చేసినవి చిన్న సినిమాలు అయినా కూడా అవి పెద్ద హిట్లుగా మారావే. అల్లరి నరేష్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది అని దాదాపు ఆడియన్స్ అంతా కూడా ఫిక్స్ అయిపోయే వాళ్ళు. రీసెంట్ టైమ్స్ లో అల్లరి నరేష్ అటువంటి సినిమాలు తీయడం పూర్తిగా మానేశాడు. అల్లరి నరేష్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన సినిమా బచ్చలపల్లి.
ఈ సినిమాకి సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. సోలే బతుకే సో బెటర్ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సుబ్బు. సాయి తేజ్ నటించిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఎట్టకేలకు అల్లరి నరేష్ హీరోగా మరో సినిమాని పట్టుకున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ఒక సెపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది దాన్ని పట్టుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ ని పెడుతూ ఈ సినిమాని డిజైన్ చేశాడు సుబ్బు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇది వరకే సినిమా మీద మంచి ఆసక్తిని పెంచింది. ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసే పనిలో పడింది చిత్ర యూనిట్. డిసెంబర్ 14న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Also Read : Daaku’s Rage From Daaku Maharaaj : బాలయ్య సినిమా అంటేనే తమన్ కు పూనకం వచ్చేస్తుంది