Daaku’s Rage From Daaku Maharaaj : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తమన్ ఒకరు. కిక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్, తన మ్యూజిక్ తో మంచి కిక్ ఇచ్చాడు. ఆ తర్వాత తమను చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన మ్యూజికల్ సక్సెస్ అందుకున్నాయి. అతి త్వరగా 50 సినిమాలను తన కెరీర్ లో ఫినిష్ చేశాడు తమన్. అయితే వరుసగా సినిమాలు వస్తున్న తరుణంలో తమన్ పాటలన్నీ కూడా ఒకేలా ఉంటున్నాయి అనే విమర్శలను ఎదుర్కొన్నాడు. కొంతకాలం మ్యూజిక్ కి గ్యాప్ ఇచ్చాడు తమన్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన తొలిప్రేమ సినిమాతో మళ్లీ రియంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది ముఖ్యంగా ఈ సినిమాలోని మ్యూజిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలోని పాటలు అన్నీ కూడా మంచి ఫీల్ ని క్రియేట్ చేసేయ్.
ఇకపోతే తమన్ కెరియర్ లో 100వ సినిమా గా వచ్చిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ కి మంచి కం బ్యాక్ ఫిలిం అయింది ఈ సినిమా. ఇకపోతే తమన్ కెరియర్ విషయానికి వస్తే అరవింద సమేత వీర రాఘవ సినిమాకి ముందు అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత అని చెప్పాలి. ఈ సినిమా తర్వాతే తమన్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. తమన్ హావా విపరీతంగా నడిచింది. ఇక తమన్ మ్యూజిక్ లానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఫేమస్. ముఖ్యంగా అఖండ సినిమాకి తమన్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
Also Read : Allu Arjun Arrests : అల్లు అర్జున్ అరెస్ట్..? పోలీసుల జీపులో తీసుకెళ్లిన పోలీసులు…
ఇక తమన్ ప్రస్తుతం అఖండ 2 కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో డాకు మహారాజు అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో వినగానే ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ ఫుల్ సాంగ్ ని త్వరలో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ ప్రోమో ను చాలామంది పోస్ట్ చేస్తూ బాలకృష్ణ సినిమా అంటేనే తమన్ కు ఎక్కడలేని పూనకం వస్తుంది అంటూ కొత్తగా ఎలివేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఒకప్పుడు సాంగ్స్ కు మాత్రమే ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు కొత్తగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఫాన్స్ ఉండడం మొదలుపెట్టారు. ఒక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఒక షేప్ కంప్లీట్ గా మారిపోతుంది అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇక బాలకృష్ణకి తమన్ అందిస్తున్న మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని డాకు మహారాజు సినిమాతో మరోసారి ప్రూవ్ అవ్వబోతుంది.