E-Paper
Advertisement

Alia Bhatt : బాలీవుడ్ హీరోయిన్‌కు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు!

Alia Bhatt : బాలీవుడ్ హీరోయిన్‌కు ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు!
Advertisement

Alia Bhatt : ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే. గత ఏడాది ‘జిగ్రా’ సినిమాతో మంచి విజయం అందుకున్న ఈమె.. అల్ఫా, లవ్ అండ్ వార్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఆలియా భట్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నా.. ఈ మధ్య జరిగిన 78వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని సందడి చేసింది. అక్కడ తన ఫ్యాషన్ సెన్స్ నిరూపించుకుంది. కలర్ఫుల్ డ్రెస్ లో అదరగొట్టేసింది. అంతేకాదు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన మనసులో కోరికను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈమె తనకి ఇష్టమైన నటుడు గురించి చెప్పి మరొకసారి వార్తల్లో నిలిచింది.

అలియా భట్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?

Advertisement

అలియా భట్ మాట్లాడుతూ.. నేను నిజంగా ఆరాధించే నటులలో ఫహద్ ఫాజిల్ కూడా ఒకరు. ఆయన చాలా గొప్ప నటుడు. ఆయన నటించిన చిత్రాలలో ఆవేశం చిత్రం అంటే నాకు ఎంతో ఇష్టం. ఎలాంటి పాత్ర అయినా సరే చాలా అవలీలగా పోషిస్తారు. ఆయన నటనలో ఏదో తెలియని శక్తి నాకు కనిపించింది. ఒక అద్భుతమైన నటుడు అందుకే అతడితో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఎవరైనా నాకు ఆయన పక్కన నటించే అవకాశం కల్పించాలని అడుగుతున్నాను అంటూ తెలిపింది. ఇక మహమ్మారి నాకు నేర్పించిన ఒక విషయం ఏమిటంటే.. మనం ఒక యూనిట్. ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆస్వాదిస్తున్నారు. ఏ రకమైన కంటెంట్ అయినా చూడవచ్చు. అయితే నాకు రోషన్ మాథ్యుతో పనిచేసే అదృష్టం కలిగింది. ఆయన చాలా అద్భుతమైన అన్నట్లు మలయాళంలో కూడా మంచి కంటెంట్ ఇచ్చారు. ఇప్పుడు హిందీలో కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు అంటూ అలియా తెలిపింది.

ఫహద్ ఫాజిల్ కెరియర్..

Advertisement

భారతీయ నటుడిగా, చిత్ర నిర్మాతగా పేరు సొంతం చేసుకున్న ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా పనిచేశాడు. 40కి పైగా చిత్రాలలో నటించిన ఫహద్ ఫాజిల్ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు. నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలతో పాటు మూడు సౌత్ ఫిలింఫేర్ అవార్డులు అలాగే పలు అవార్డులు కూడా అందుకున్నారు. ఇక ఈమధ్య మలయాళంలోనే కాదు పలు భాషా చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ , ‘పుష్ప 2’ చిత్రాలలో నటించి తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఈయన ఇప్పుడు ఆలియా భట్ మనసును కూడా మెప్పించారు. మరి ఆలియా భట్ కోరిక మేరకు ఫహద్ ఫాసిల్ సరసన ఈమెకు నటించే అవకాశం లభిస్తుందేమో చూడాలి. కనీసం ఆయన సినిమాలో ఒక అవకాశం వచ్చినా చాలు అని ఆశపడుతోంది ఆలియా భట్. మరి ఆలియా కోరికను తీర్చే ఆ దర్శక నిర్మాతలు ఎవరు చూడాలి? అంటూ అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ:Aha Dance Icon S2: ఛీ ఛీ ఏంటీ దరిద్రం.. డ్యాన్స్ చేయమంటే… అన్నీ చూపిస్తున్నారు

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×