BigTV English

Tourist family : థియేటర్లో మిస్సయిన ఈ ఆణిముత్యాన్ని, ఈ ఓటిటి లో చూడొచ్చు

Tourist family : థియేటర్లో మిస్సయిన ఈ ఆణిముత్యాన్ని, ఈ ఓటిటి లో చూడొచ్చు

Tourist family : కొన్ని సినిమాల గురించి ఎంత మాట్లాడినా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. ఎంత రాసిన ఇంకా రాయాలి అనిపిస్తుంది. కొన్ని సినిమాల గురించి మాట్లాడటానికి పదాలు కూడా దొరకని సందర్భాలు ఉంటాయి. అంత భావోద్వేగానికి గురిచేస్తాయి కొన్ని సినిమాలు. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. కానీ వాటన్నిటికంటే ఒక్క మెట్టు పైన కూర్చుంటుంది అభిషేన్ దర్శకత్వం వహించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా. ఈ సినిమా థియేటర్లో చూస్తున్నంత సేపు కాసేపు ఆడియన్స్ను నవ్విస్తుంది. మరుక్షణం కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆణిముత్యాలు లాంటి సీన్స్ ఈ సినిమాల్లో బోలెడు ఉన్నాయి. అందుకే పెద్ద సినిమాలతో పోటీపడినా కూడా దాదాపు 75 కోట్ల వరకు వసూలు చేసింది ఈ సినిమా.


టూరిస్ట్ ఫ్యామిలీ కథ 

ఈ సినిమా విషయానికి వస్తే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండదు. శ్రీలంక నుండి ఒక ఫ్యామిలీ తమిళనాడుకు వచ్చి బ్రతుకుతుంది. అక్కడ ఉన్న మనుషులతో ఈ శ్రీలంక ఫ్యామిలీ ఎలా కలిసిపోయింది. ఆ కాలనీ మనుషులు వీళ్లను ఎలా ప్రేమించడం మొదలుపెట్టారు. అనేది సింపుల్ గా ఈ సినిమా కథ. కానీ ఈ సినిమాలో కొన్ని సీన్స్ దర్శకుడు డిజైన్ చేసిన విధానం మాత్రం వర్ణనాతీతం. ముఖ్యంగా 25 ఏళ్ల వయసు ఉన్న ఒక దర్శకుడు ఇంత గొప్పగా ఎమోషన్స్ చూపించటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక క్షణం లో ఏడిపిస్తూ మరుక్షణం నవ్వించడం ఈ దర్శకుడు యొక్క రచన ప్రత్యేకత. ఈ సినిమాలో నటించిన నటీనటులు తీరు కూడా జీవించిన విధంగా ఉంటుంది. ఈ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో మనం కూడా కుటుంబ సభ్యులు అయిపోతాము అనేటట్లు ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయిపోతాడు.


ఏ ఓటిటి లో చూడొచ్చు

థియేటర్ లో మంచి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ సినిమా త్వరలో ఓటిటి ఎంట్రీ ఇవ్వనుంది. జూన్ రెండవ తారీఖున ఈ సినిమా హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ సినిమా హాట్స్టార్ లోకి రాబోతుంది అంటే అన్ని భాషల్లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. థియేటర్లో మిస్సయిన ఈ అద్భుతమైన సినిమాని ఓటిటి చూసి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం ఖాయం. అలానే ఒక్కో సీన్ గురించి మాట్లాడుకోవడం తప్పనిసరిగా జరుగుతుంది. ఇంత మంచి సినిమాను థియేటర్లో ఎందుకు చూడలేకపోయామని పోస్టులు కనిపించిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. థియేటర్స్ లో కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఓటిటి లో ఎంతమంది హృదయాలను హత్తుకుంటుందో వేచి చూడాలి

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×