Kaithi 2 : కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసి… ఖైదీ (Kaithi), విక్రమ్ వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్న ఐకానిక్ క్యారెక్టర్లు అన్నింటినీ ఒకే తెరపై ప్రేక్షకులు చూసే అవకాశాన్ని కల్పించబోతున్నారనే ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. లోకేష్ క్రియేట్ చేసిన ఢిల్లీ బాబు, విక్రమ్ (Vikram), రోలెక్స్ (ROLEX) ‘ఖైదీ 2’ (Kaithi 2)లో భాగం కాబోతున్నారు అనే కిక్ ఎక్కించే వార్త వైరల్ అవుతోంది.
ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్స్
కోలీవుడ్ యంగ్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన తమిళ సినిమాలు అన్నీ తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. జయపజయాలతో సంబంధం లేకుండా తనకు నచ్చిన కథలు చేస్తూ, వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు కార్తీ. గత ఏడాది ‘సత్యం సుందరం’ సినిమాతో ఈ హీరో తన ఖాతాలో సూపర్ హిట్ ను వేసుకున్నారు. ప్రస్తుతం కార్తీ ‘సర్దార్ 2’, ‘ఖైదీ 2’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల సీక్వెల్స్ లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. పైగా ఈ రెండు సీక్వెల్స్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
కానీ కార్తీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ మాత్రం ‘ఖైదీ 2’నే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ సీక్వెల్ అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖైదీ’కి సీక్వెల్ గా రాబోతోంది ‘ఖైదీ 2’. తాజాగా ‘ఖైదీ 2’ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వార్తల ప్రకారం కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, సూర్య, ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తున్నట్టు సమాచారం.
‘విక్రమ్’ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించగా, ఫహాద్ ఫాజిల్ కీ రోల్ పోషించారు. అలాగే సూర్య ‘రోలెక్స్’ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. సూర్య పాత్రకు దక్కిన ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు. ‘రోలెక్స్’ అనే టైటిల్ తో ఓ సెపరేట్ సినిమాను తీయబోతున్నట్టు ఇప్పటికే లోకేష్ వెల్లడించారు.
దళపతి విజయ్ వాయిస్ ఓవర్
మరో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే దళపతి విజయ్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ కి దళపతి వాయిస్ ఓవర్ ఇస్తారని, అక్కడి నుంచి ‘విక్రమ్ 2’కి లీడ్ ఉంటుందనే క్రేజీ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఈ వార్త తెలిసిన మూవీ లవర్స్ ముగ్గురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం అంటే మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటూ, తెగ ఖుషి అవుతున్నారు.