Allari Naresh :’అల్లరి’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ (EVV Satyanarayana) వారసుడు నరేష్ (Naresh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కామెడీ జానర్ నే ఎంచుకున్న నరేష్ ఈ సినిమాతో మంచి విజయం సంపాదించడంతో సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకొని అల్లరి నరేష్ గా మారిపోయారు. ఇక తర్వాత కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన, తన సెకండ్ ఇన్నింగ్స్ లో ‘నాంది’ సినిమా చేసి తనలోని మరో కోణాన్ని అభిమానులకు పరిచయం చేశారు. ఈ సినిమాలో తొలిసారి సీరియస్ పాత్ర పోషించి ఆకట్టుకున్న అల్లరి నరేష్, ఇప్పుడు ఒక సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం .
అల్లరి నరేష్ పక్కన హీరోయిన్గా నిహారిక..
అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ఆ కొత్త సినిమాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కూడా చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అటు నిహారికకు, నిహారిక వల్ల ఈ సినిమాకి భారీ ప్లస్ కాబోతోందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు నిర్మిస్తున్నారు అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నిహారిక కెరియర్..
నిహారిక విషయానికి వస్తే.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఎక్కువగా స్టార్ హీరోల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనే ఈమె.. గతంలో మహేష్ బాబు (Mahesh Babu) అలాగే అడివి శేష్ (Adivi shesh) లతో కలసి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది. అంతేకాదు టాలీవుడ్, బాలీవుడ్ హీరోలతో కూడా నిహారిక రీల్స్ చేస్తూ ఉంటుంది. 2020 లో లక్ష మంది ఫాలోవర్స్ ను ఇన్స్టాగ్రాం లో కలిగి వున్న నిహారిక, 2022లో దాదాపు 2.8 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది. అలాగే 1.9 మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ను యూట్యూబ్ లో కలిగి ఉంది. అలాగే ట్విట్టర్, ఫేస్ బుక్ , టిక్ టాక్ వంటి వేదికల ద్వారా కూడా లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ ఫిలిం ఇండస్ట్రీ అయినా.. ఏ హీరో అయినా సరే షార్ట్ వీడియోల కోసం నిహారిక సమయం అడిగితే తప్పకుండా ఆమోదిస్తారు. కొందరైతే ఏకంగా తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఆమెనే స్వయంగా సంప్రదిస్తారు కూడా.. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, అడివి శేష్ ‘మేజర్’, యష్ ‘కే జి ఎఫ్ 2’ ప్రమోషన్ల కోసం ఆయా హీరోలతో కలిసి నిహారిక రీల్స్ కూడా చేసింది. ఇక ఇలాంటి ఈమె.. ఇప్పుడు అల్లరి నరేష్ పక్కన హీరోయిన్గా నటిస్తే ఇక ఆమెతో పాటు ఆ సినిమాకి కూడా మంచి హైప్ వస్తుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.