Vakkantham Vamsi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ లో వక్కంతం వంశీ ఒకరు. ప్రేమ కోసం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు వంశీ. ఆ తర్వాత కలుసుకోవాలని సినిమాకి డైలాగ్స్ అందించారు ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన అశోక్ సినిమాకి కథను అందించారు. ఇక వంశీ కెరియర్ లో కిక్ ఎవడు, రేసుగుర్రం, టెంపర్ వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా కథను అందించింది వక్కంతం వంశీ. మామూలుగా రచయిత మరియు పూరి జగన్నాథ్ ఎవరి కథలను తీసుకొని సినిమాలు చేయరు. కానీ తనకంటే గొప్ప కథ ఎవరు రాసినా కూడా దానిని ఒప్పుకొని సినిమా చేస్తాను అంటూ పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఒక సందర్భంలో ఎన్టీఆర్ కి ఒక కథను చెప్పాడు పూరి జగన్నాథ్. వంశీ నాకు ఒక కథ చెప్పాడు ఒకసారి వింటావా అనగానే, వంశీ చెప్పిన కథ విని టెంపర్ సినిమాను చేశాడు పూరి. ఆ సినిమా పూరి కెరియర్ కి ఎంత పెద్ద ప్లస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
నా పేరు సూర్యతో దర్శకుడుగా
పలు సినిమాలు రచయితగా పనిచేసిన తర్వాత నా పేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడుగా మారాడు వంశీ. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని డిజాస్టర్ ను చవిచూసింది. ఎంతోమంది దర్శకులకు మంచి కథలను ఇచ్చిన రచయిత ఒక కథతో సినిమా చేస్తున్నాడు అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా విషయంలో కూడా అలాంటి అంచనాలే ఎదురయ్యాయి. అయితే ఈ సినిమా ఫస్ట్ అఫ్ కొంతమేరకు బాగానే ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మాత్రం ఊహించిన విధంగా ఉంటుంది. ఏదేమైనా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ అయితే సాధించలేకపోయింది. ఈ సినిమా ఫెయిల్ అయిన వెంటనే అల్లు అర్జున్ ఏం చెప్పారంటే.
అల్లు ఫ్యామిలీ రియాక్షన్
ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత అల్లు అర్జున్ వక్కంతం వంశీకి ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పేవారట. ఒక ప్లాప్ సినిమా ఇస్తే దర్శకుడు వైపు చూడని ఈ రోజుల్లో అల్లు అర్జున్ నాకు అలా చెప్పేవాడు. అల్లు అర్జున్ బంగారం అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు వంశీ. అంతేకాకుండా అల్లు అరవింద్ కూడా నువ్వు ఏం చెప్పావో అదే తీసావ్ చెప్పిందానికన్నా బాగా తీసావ్ అని చెప్పారట. ఇకపోతే రచయితగా రేసుగుర్రం అనే సినిమాతో హిట్ ఇచ్చాడు వంశీ. అయితే అల్లు ఫ్యామిలీ ఆ సినిమా డిజాస్టర్ గురించి పెద్దగా పట్టించుకోకపోయినా కూడా నాకు మాత్రం ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ సినిమా హిట్ అయితే ఎంతమంది కొత్త దర్శకులను పరిచయం చేసేవాడు అంటూ అల్లు అర్జున్ పై ప్రశంసలు వర్షం కురిపించాడు దర్శకుడు వంశీ.
Also Read : NTRNeel Movie : తారక్ బక్కచిక్కింది డ్రాగన్ కోసమే… 5 నెలల్లో ఎన్ని కేజీలు తగ్గాడో తెలుసా..?