NTRNeel Movie : సినిమా హీరో అంటే కేవలం నటించడం మాత్రమే కాదు సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఒక క్యారెక్టర్ తో ప్రేక్షకుడిని మెప్పించాలంటే అంత సాధారణమైన విషయం కాదు. అందుకే తెలుగు హీరోలు చాలామంది సినిమాల కోసం కష్టపడుతూనే ఉంటారు. ముఖ్యంగా ఎన్టీఆర్ విషయానికొస్తే ఎన్టీఆర్ స్టార్టింగ్ కెరియర్లో ఎంత లావుగా ఉండేవారు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కొన్ని ఎన్టీఆర్ సినిమాలు చూస్తే మనకే ఏదోలా అనిపిస్తుంది. రాఖీ అశోక్ వంటి సినిమాల్లో విపరీతమైన లావుగా కనిపించేవాడు తారక్. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ గా ఎన్టీఆర్ మొహం మీద చెప్పేశారు. చాలా అసహ్యంగా ఉన్నారు తారక్ అని. ఆ తర్వాత ఎన్టీఆర్ బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేసి విపరీతంగా బరువు తగ్గాడు. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత కంట్రీ సినిమాలో కూడా ఎన్టీఆర్ చాలా సన్నగా కనిపిస్తారు.
టెంపర్ సిక్స్ ప్యాక్
పూరి జగన్నాథ్ విషయానికి వస్తే తన సినిమాల్లో హీరోలు ఎప్పుడు ఫిట్ గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. దేశముదురులో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ ను ఆ రోజుల్లో చూపించాడు. ఆ తర్వాత టెంపర్ సినిమాలో కూడా తారక్ సిక్స్ ప్యాక్ చూపించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కూడా తారక్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాడు. రీసెంట్గా వచ్చిన ప్రతి సినిమాలోని ఎన్టీఆర్ చాలా సన్నగా కనిపించాడు. ఇక ఎన్టీఆర్ రీసెంట్గా దేవరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ చూడడానికి కొంచెం లావుగా కనిపిస్తాడు. ఒక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం తారక్ చాలా కష్టపడ్డారు.
సినిమా కోసమే తగ్గారు
ఇక రీసెంట్ టైమ్స్ లో తారక్ చాలా ఆడియో లాంచెస్ లో కనిపిస్తూ వచ్చాడు. ప్రతి ఆడియో లాంచ్ లోను సన్నగా ఉన్న తారక్ ను మనం గమనించవచ్చు. అయితే కేవలం ఇది ప్రశాంత్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమా కోసమే చేశారట. దాదాపు 18 కేజీల బరువు ఎన్టీఆర్ తగ్గారు. కేవలం ఐదు నెలల్లోనే రోజుకు మూడు గంటలపాటు వర్కౌట్ చేసి, ఫ్యాట్ ఎంకరేజ్ చేయకుండా హై ప్రోటీన్స్ తో ఎన్టీఆర్ డైట్ ను పాటించారు. దీని ఫలితంగా ఎన్టీఆర్ విపరీతంగా బరువు తగ్గి పోయారు. ఒక సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతలా కష్టపడతారు అని పలు సందర్భాల్లో ప్రూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి తారక్ అదే తరహాలో కష్టపడ్డాడని చెప్పాలి.
Also Read : Mahesh Babu: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. షాక్ లో ఇండస్ట్రీ..!