Sai Pallavi:లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి (Sai Pallavi), శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే మెప్పించిన ఈమె ఆ తరువాత చాలా సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ.. తాను చేసే ప్రతి సినిమాతో కూడా సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈమె నటి మాత్రమే కాదు గొప్ప డాన్సర్ కూడా.. తాను నటించే ప్రతి సినిమాలో కూడా తన డాన్స్ పెర్ఫార్మెన్స్ కచ్చితంగా వుండేలా ప్లాన్ చేసుకుంటోంది. ఇకపోతే గ్లామర్ ప్రపంచంలో కూడా అందాలు ఒలకబోయకుండా చాలా పద్ధతిగా కనిపిస్తూ.. కుర్ర కారుకు ఆరాధ్య దేవతగా నిలిచింది. ఇకపోతే ఇంతలా సక్సెస్ సొంతం చేసుకోవడానికి గల కారణం ఏమిటి అని ఎంతోమంది అడుగుతున్నా.. స్పందించని లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ఎట్టకేలకు ఓపెన్ అవుతూ తన సక్సెస్ మంత్ర ఏంటో చెప్పేసింది.
అదే నిజమైన సక్సెస్ – సాయి పల్లవి
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మాట్లాడుతూ.. “అవార్డుల కంటే కూడా ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవడమే ముఖ్యం. థియేటర్లలో కూర్చున్న ప్రేక్షకులు నా పాత్రల భావోద్వేగాలతో కనెక్ట్ కావడాన్నే అసలైన సక్సెస్ గా భావిస్తాను. ఒకవేళ ఆ తర్వాత ఆ పాత్రలకు అవార్డులు లభించాయి అంటే అదంతా అదనపు బోనస్ గానే అనుకుంటాను. అందుకే నేనెప్పుడూ కూడా నా పాత్రను ఎంచుకునేటప్పుడు కథలో లోతు ఎంత ఉంది..? నా పాత్రలో బలమైన భావద్వేగం ఉందా? లేదా? అది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? అని చూస్తాను. నా పాత్ర ద్వారా ప్రేక్షకులకు నిజాయితీగల కథలను చెప్పాలని మాత్రమే నేను నిత్యం తపన పడుతూ ఉంటాను. నేను అనుకున్నట్లుగా ఆ పాత్రల తాలూకు భావోద్వేగాలతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారంటే, అదే గొప్ప విజయం గా భావిస్తాను. అందుకే నేనెప్పుడూ కూడా అవార్డుల కంటే కూడా ప్రేక్షకుల ప్రేమను గెలుచుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది.
తేనెటీగల పెంపకంపై ఆసక్తి వుంది – సాయి పల్లవి
“ప్రస్తుతం నేను బీ కీపింగ్ (తేనెటీగల పెంపకం) పై ఆసక్తి పెంచుకున్నాను. ఈ కొత్త హాబీ నాకు ప్రకృతితో మరింత కనెక్ట్ అయ్యే అవకాశాన్ని ఇస్తోంది” అంటూ తెలిపింది. ఇక మొత్తానికైతే తన సక్సెస్ కు గల కారణాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇక సాయి పల్లవి విషయానికొస్తే.. తెలుగులో చివరిగా నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన ‘తండేల్’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ‘రామాయణ’ చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టబోతున్నందుకు ఉత్సాహంగా ఉందని, ముఖ్యంగా సీత పాత్రలో నటించడం గౌరవంగా ఉందని కూడా తెలిపింది. ఇక మొత్తానికి అయితే సాయి పల్లవి ఇలా వరుసగా సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా పేరూ సొంతం చేసుకుంది.
Also Read:Mahesh Babu: రూ.3.4 కోట్ల స్కాంలో మహేష్ బాబు..నోటీసులు ఇచ్చిన ఈడీ..!