BigTV English

Allu Aravind: ఫేక్ ఐడితో హీరోయిన్ ను ఫాలో అయిన నిర్మాత…ఈ యాంగిల్ కూడా ఉందా?

Allu Aravind: ఫేక్ ఐడితో హీరోయిన్ ను ఫాలో అయిన నిర్మాత…ఈ యాంగిల్ కూడా ఉందా?

Allu Aravind:  ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంటున్న వారిలో నటుడు ప్రియదర్శి (Priyadarshi)ఒకరు. తాజాగా కోర్టు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ప్రియదర్శి త్వరలోనే మిత్రమండలి(Mitra Mandali) అనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎమ్ (Niharika NM), రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా వంటివారు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహిస్తున్నారు.


హీరోయిన్లను ఫాలో అవుతున్న అల్లు అరవింద్..

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున అభిమానులను కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అల్లు అరవింద్ (Allu Aravind)మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. తాను ఫేక్ ఐడీలతో హీరోయిన్లను ఫాలో అవుతున్న విషయాన్ని అల్లు అరవింద్ బయట పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.  ఈ సినిమా కోసం బన్నీ వాసు కొంతమంది హీరోయిన్ల ఫోటోలను తీసుకువచ్చారు. అయితే తాను ఈ అమ్మాయిని తీసుకుందాం అని చెప్పగానే ఈ అమ్మాయి మీకు తెలుసా అంటూ వాసు నన్ను అడిగారు.


ఫేక్ ఐడి..

ఆవిడను నేను ఇంస్టాగ్రామ్ లో తెగ చూసానయ్యా.. ఆమెను తీసుకుందామని చెప్పాను.  నేను ఒక ఫేక్ ఐడి(Fake Id) ద్వారా ఇంస్టాగ్రామ్(Instagram) లో అందరిని ఫాలో అవుతూ ఉంటానని సీక్రెట్ బయటపెట్టారు. అలాగే మిమ్మల్ని కూడా ఫేక్ ఐడితో ఫాలో అవుతున్నానని హీరోయిన్ నిహారిక ఎన్ ఎంను ఉద్దేశించి అల్లు అరవింద్ గారు మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. అంతలోనే పక్కన వాళ్ళు అది ఫేక్ ఐడి కాదు పర్సనల్ ఐడి అని చెప్పండి సార్ అంటూ కామెంట్  చేశారు.

హీరోయిన్ గా అవకాశం..

ఇక ఈ విషయం గురించి అల్లు  అరవింద్ మాట్లాడుతూ ఒరిజినల్ ఐడితో హీరోయిన్లను ఫాలో అయితే వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా. ఏవేవో వార్తలు రాసేసి బూతు కామెంట్లు పెడతారు అందుకే ఒరిజినల్ ఐడితో కాకుండా ఇలా ఫేక్ ఐడితో తాను అందరిని ఫాలో అవుతున్నాను అంటూ అల్లు అరవింద్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో అందరూ షాక్ అవ్వడమే కాకుండా మీరు ఇలాంటి పనులు కూడా చేస్తారు సర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే సినిమా అవకాశాలను కూడా అందుకున్నారని చెప్పాలి. మరి మొదటిసారి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందు రాబోతున్న నిహారిక ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఫేక్ ఐడితో అల్లు అర్జున్..
ఇక అల్లు అరవింద్ ఫేక్ ఐడి గురించి ఆయన స్వయంగా బయటపెట్టారు. కానీ అల్లు అర్జున్ కూడా ఇదే విధంగా ఒక ఫేక్ ఇంస్టాగ్రామ్ ఐడితో పలువురు సెలబ్రిటీలను, హీరోలను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వారి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటారని తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ కూడా ఫేక్ ఐడితో ఫాలో అవుతున్నారనే విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా సెలబ్రిటీలు వారి వ్యక్తిగత ఐడీలతో ఫాలో అవ్వడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయన్న నేపథ్యంలోనే ఇలా ఫేక్ ఐడీలతో సెలబ్రిటీలను ఫాలో అవుతుంటారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×