Shilpa Shetty: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి (Shilpa Shetty) , ఆమె భర్త రాజ్ కుంద్రా(Raj Kundra) ఇటీవల కొన్ని వివాదాల కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక అంతా సద్దుమణిగింది అని అనుకుంటూ ఉండగానే.. ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా. ఈ ఘటన కారణంగా ఆయన మళ్లీ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా విదేశీయులతో రాజ్ కుంద్రా ఘర్షణ ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి జంట క్రొయేషియా పర్యటన వెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఈ పర్యటనలోనే ఈ వివాదం తలెత్తింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు అంతర్జాలంలో తెగ సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా శిల్పా శెట్టి దంపతులకు అక్కడ వారితో గొడవ ఏంటి? అని నెటిజెన్స్ ఆరా తీయగా.. కుంద్రా చెప్పిన విషయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
మళ్లీ వివాదాల్లో చిక్కుకున్న రాజ్ కుంద్రా..
విదేశీయులతో రాజ్ కుంద్రా గొడవపడ్డారు అంటూ ఒక వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ ఉండగా.. దీనిపై రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. “నేను, నా భార్య 50వ పుట్టినరోజు కోసం ఘనంగా ప్లాన్ చేశాను, శిల్ప తో పాటూ4కొందరు అతిధులతో క్రొయేషియా హోటల్లో టేబుల్ ని నేను ఒక సంవత్సరం క్రితమే బుక్ చేశాను. కానీ ఏజెంట్ కారణంగా అది డబుల్ బుక్ అయింది. అదే టేబుల్ ని వేరొకరు కూడా బుక్ చేసుకున్నారు. దీంతో మా మధ్య ఘర్షణ మొదలైంది. ఇలా జరగడానికి గల కారణం ఏంటి? అని ప్రశ్నించగా.. “వెయిట్ చేయండి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని దీంతో నిరాశ కలిగిందని ” కుంద్రా తన బాధను వెల్లడించారు.
యాజమాన్యం పై అసహనం..
ఇకపోతే హోటల్ యాజమాన్యంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ.. వీరి కారణంగా నేను, నా భార్య, పిల్లలు, నా తల్లిదండ్రులు, అత్తగారితో సహా మొత్తం 20 మంది అతిధులతో ఈ హోటల్ వద్ద ఎదురుచూడాల్సి వచ్చింది. అందరూ కూడా ఎదురుచూసి విసిగిపోయారు. కుటుంబం అతిథులతో ఆనందంగా జరగాల్సిన ఈ కార్యక్రమం తీవ్ర ఒత్తిడిని పెంచింది అంటూ ఆయన తన బాధను వెల్లడించారు. ఇక మొత్తానికైతే భార్య కోసం బుక్ చేసిన టేబుల్ కారణంగానే ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచారు రాజ్ కుంద్రా.
also read: Mitra Mandali Teaser: ‘మిత్రమండలి’ టీజర్ రిలీజ్.. కామెడీతో చచ్చిపోతే ఎవరు గ్యారెంటీ!
కుటుంబానికి మొదటి ప్రాధాన్యత..
కుటుంబానికి సమయాన్ని కేటాయించడంలో రాజ్ కుంద్రా ఎప్పుడు ముందే ఉంటారు. బిజినెస్మేన్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన పలు వ్యాపారాలతో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ మెన్ గానే పేరు సొంతం చేసుకున్నారు. కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయిస్తూ.. కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇంతకుముందు కూడా పలు కోర్టు వివాదాల్లో శిల్పా శెట్టి కూడా తన భర్త కి బలమైన అండగానే నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరి వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి