Allu Aravind : యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ (Thandel). ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా, భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ‘తండేల్’ టీం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) “దేవి శ్రీ ప్రసాద్ (Devisri Prasad)ను వద్దన్నాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
మ్యూజిక్ తోనే సగం సక్సెస్
ఇంటర్వ్యూలో “తండేల్ సినిమాకు డీఎస్పీ మ్యూజిక్ ఎలా ఉంది?” అని ప్రశ్నించగా… నాగ చైతన్య స్పందిస్తూ “ట్రైలర్లో ఒక జైల్ ఎపిసోడ్, స్టార్మ్ సీక్వెన్స్… ఇలా ఏం చూసుకున్నా సరే మూవీ సోల్ అనేది ఒక లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే ఎప్పుడైనా సరే ఒక మంచి ఆల్బమ్ కావాలి. దేవి గారు ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. మొన్న రిలీజ్ అయిన హైలెస్సా పాటకు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ‘బుజ్జి తల్లి’ రెస్పాన్స్ ను మరేపాటైనా అందుకుంటుందా అనే ఒక చిన్న డౌట్ ఉండేది. కానీ ‘హైలెస్సో’ సాంగ్ రెస్పాన్స్ చూసాక చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. పైగా శ్రీమణి లిరిక్స్ ను కూడా బ్లెండ్ చేసి ఆయన మంచి ఔట్పుట్ ఇచ్చారు. ఆడియోతోనే ఈ సినిమా విషయంలో సగం సక్సెస్ అయ్యాం. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ కి థాంక్స్ చెప్పాలి” అని చెప్పుకొచ్చారు.
మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్షన్ వెనుక ఇంత స్టోరీ ?
నిర్మాత అల్లు అరవింద్ స్పందిస్తూ “తండేల్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకుందామనే డిస్కషన్ లో దేవి శ్రీ ప్రసాద్ పేరు వచ్చింది. నేను వద్దని చెప్పాను. ఎందుకంటే పుష్ప సినిమాతో పాటు తండేల్ ప్యారలాల్ గా వెళ్తోంది. దానికుండే కాన్సన్ట్రేషన్ కి, వర్క్ కి దేవి ప్రసాద్ టైమ్ స్పేర్ చేయడు. దేవిశ్రీ ప్రసాద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా ఫ్రెండ్ కొడుకు. మాకు బోలెడు సినిమాలు చేశాడు. అసలు బయట మామూలుగా ఎక్కడైనా కనిపిస్తే, మమ్మల్ని లవర్స్ అనుకునేట్టుగా కౌగిలించుకుంటాం. అంత ఇష్టం నాకు దేవిశ్రీ.
కానీ ఈ సినిమాకు కరెక్ట్ కాదేమోనని సందేహ పడుతూ, ఓ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర బన్నీతో మ్యూజిక్ విషయంలో కన్ఫ్యూజింగ్ గా ఉన్నాము… దేవిని ఎందుకు వద్దనుకుంటున్నామంటే… మీ పిక్చర్ లోనే మొత్తం లాగేస్తారు. మాకు టైం స్పేస్ చేయరు. నిన్ను, డైరెక్టర్ ని అడిగి ఆయన్ని టైంకి తెచ్చుకోవడం వద్దు అంటున్నా అని చెప్పాను. లవ్ స్టోరీ అన్న తర్వాత దేవి విషయంలో ఆలోచించకండి అని చెప్పాడు బన్నీ. అలా దేవిశ్రీ ప్రసాద్ ని ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం వెనుక కొంత క్రెడిట్ బన్నీకి కూడా చెందుతుంది” అని వివరించారు అల్లు అరవింద్.