Hardik Pandya: భారత్ – ఇంగ్లాండ్ మధ్య పూణే వేదికగా జరిగిన 4 వ టి-20 లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే {India-England 5 T-20 series} సిరీస్ ని 3 – 1 తో కైవసం చేసుకుంది. దీంతో ముంబై వేదికగా ఆదివారం జరగబోయే చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ {England} తో భారత్ అమీతుమీ తేల్చుకోబోతోంది. ఇప్పటికే సిరీస్ ని కైవసం చేసుకున్న భారత జట్టుకు ఈ ఆఖరి మ్యాచ్ నామమాత్రంగా మారింది.
Also Read: Kevin Pietersen: 12 మందితో ఆడి గెలిచారు.. ఇది మగతనం కాదు ?
మరోవైపు సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు చివరి మ్యాచ్ లోనైనా గెలిచి ఆత్మవిశ్వాసంతో 3 వన్డేల సిరీస్ లో బరిలోకి దిగాలని భావిస్తోంది. {India-England 5 T-20 series} నాలుగోవ టి-20 లో టీమిండియా {India} గెలుపులో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా {Hardik Pandya} కీలకపాత్ర పోషించాడు. టి-20 ల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ భారత బ్యాటర్ గా నిలిచాడు హార్థిక్ పాండ్యా. ఈ మ్యాచ్ లో 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 పరుగులు చేశాడు.
ఓ దశలో 79/5 ఉన్న భారత జట్టు {team India}ను 20 ఓవర్లలో 181/9కి తీసుకువచ్చాడు. ముఖ్యంగా 18వ ఓవర్ లో జామీ ఓవర్టెన్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా కొట్టిన నో- లుక్ సిక్స్ ఈ మ్యాచ్ లో హైలైట్ గా మారింది. మూడవ టి-20 లో విఫలమైన హార్దిక్ పాండ్యా {Hardik Pandya} పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. పాండ్యా వల్లే 3 వ టి-20 ఓడిపోయామనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఈ నాలుగవ మ్యాచ్ లో మాత్రం విమర్శకులకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు.
హార్దిక్ పాండ్యా – శివమ్ దూబే { Shivam Dube} దెబ్బతో భారత జట్టు 180 ప్లస్ స్కోర్ ని సాధించగలిగింది. ఒత్తిడిలో కూడా తన ఆట తీరు ఏంటో హార్దిక్ పాండ్యా {Hardik Pandya} మరోసారి నిరూపించుకున్నాడు. ఇక అంతర్జాతీయ టి-20 ల్లో 500 ప్లస్ రన్స్, 50 + వికెట్లతో పాటు 5 కంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా హార్దిక్ పాండ్యా చరిత్రకెక్కాడు. దీంతో హార్దిక్ పాండ్యాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Concussion Substitutes: ‘కంకషన్ సబ్‌స్టిట్యూట్’ అంటే ఏంటీ.. రూల్స్ వివరాలు ఇవే ?
అయితే 4వ టి-20 లో తన ఇన్నింగ్స్ పై తాజాగా హార్దిక్ పాండ్యా {Hardik Pandya} స్పందిస్తూ.. ఫ్యాన్స్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తానని అన్నాడు. “నేను ఎప్పుడూ అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అభిమానులు టికెట్ కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేస్తాను. ప్రతిక్షణం ఆటకోసమే పరితపిస్తా. ఆట నాకు ఎన్నో తిరిగి ఇచ్చింది. క్రికెటే నా జీవితం. నా తొలిప్రేమ కూడా అదే. తొలిప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే” అని అన్నారు హార్దిక్ పాండ్యా.
THE CRAZE FOR HARDIK PANDYA AT THE TEAM'S HOTEL. 🤯
Hardik said, "I'm someone who has always played for fans. I want to do well for them". pic.twitter.com/4Fg5hUdgUt
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 1, 2025