BigTV English

Amaravati Capital: సజ్జల నోరు జారారా? నిజం చెప్పారా? లేక జగన్ కి కోపం తెప్పించారా?

Amaravati Capital: సజ్జల నోరు జారారా? నిజం చెప్పారా? లేక జగన్ కి కోపం తెప్పించారా?

వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే జగన్ అమరావతి నుంచే పాలన చేస్తారంటూ ఓ మీడియా కాన్ క్లేవ్ లో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీగా చెప్పారు. ఆ వ్యవహారం ఇప్పుడు వైరల్ అవుతోంది. చెప్పింది సజ్జలే కానీ జగన్ కాదు. దీంతో టీడీపీ ఓరేంజ్ లో ఆడుకుంటోంది. అమరావతికి సజ్జల ఓకే చెప్పారంటే వైసీపీ విధానం కూడా అదే అయి ఉంటుందని, అంటే జగన్ గతంలో చెప్పింది అబద్ధమేనా అని ప్రశ్నిస్తోంది. రాజధానిపై జగన్ జె టర్న్ అంటూ ట్రోల్ చేస్తోంది టీడీపీ.


ఏది నిజం? ఎవరి చెప్పింది నిజం?
పోనీ సజ్జల చెప్పిందే నిజం అనుకుందాం, మరి జగన్ గతంలో చెప్పింది అబద్ధమేనా? సాక్షాత్తూ అసెంబ్లీలోనే ఆయన మూడు రాజధానులు అన్నారు. గత ఎన్నికల ప్రచారంలో కూడా తాను ప్రమాణ స్వీకారం చేసేది విశాఖనుంచే అని సవాల్ విసిరారు. అవన్నీ తప్పుడు ఇంటర్ ప్రెటేషన్ అని సజ్జల స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇంత బహిరంగంగా రాజధాని విషయంలో జగన్ ని సజ్జల కవర్ చేయాలని చూడటం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. ప్రత్యర్థి పార్టీలకు ఇదో పెద్ద పాయింట్ లా దొరికింది. సజ్జల, జగన్‌ని బకరా చేస్తున్నారా? లేక జగన్, సజ్జల‌ని బకరా చేస్తున్నారా? లేక ఇద్దరూ కలిసి డ్రామా ఆడుతూ, ప్రజలు ఈ డ్రామాలు పట్టించుకోరు అని అనుకుంటున్నారా? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.

ఉలుకు పలుకు లేని సాక్షి..
మామూలుగా ఇలాంటి పెద్ద స్టేట్ మెంట్ ని సాక్షి రచ్చ చేయాలి. అమరావతికి జగన్ జై కొట్టారని, వైసీపీ జిందాబాద్ కొట్టిందని వార్తలివ్వాలి. కానీ సాక్షి అస్సలు ఒక్క అక్షరం కూడా రాయలేదు, టీవీలో ఒక్క డిబేట్ కూడా జరగలేదు. అంటే దాని అర్థమేంటి? సజ్జల వ్యాఖ్యలు వైసీపీ మనోగతం కాదా, కనీసం వాటిని సాక్షి కూడా లక్ష్యపెట్టడం లేదా. మిగతా విషయాల్లో ఏమో కానీ రాజధాని విషయంలో మాత్రం జగన్ డైలమా, పార్టీకి కూడా తీరని నష్టం చేకూరుస్తోంది. ఇటు అమరావతిలో జనం నమ్మక, అటు విశాఖలో ఓట్లు పడక.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారు వైసీపీ నేతలు.

మిగతా నేతల పరిస్థితి?
సజ్జల తాను చెప్పాల్సింది చెప్పి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మిగతా నేతలకు ఈ ప్రశ్నలు కచ్చితంగా ఎదురవుతాయి. సజ్జల వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అంటే రోజా ఏం చెబుతారు, పేర్ని నాని ఆన్సర్ ఏంటి.. రాజధాని మాదే అని చెప్పుకున్న గుడివాడ అమర్నాథ్ రియాక్షన్ ఏంటి? మొత్తానికి వైసీపీని ఇరకాటంలో పడేశారు సజ్జల. జగన్ కి నమ్మినబంటులా ఉంటూ ఇప్పుడు జగన్ నే అమరావతి విషయంలో అడ్డంగా బుక్ చేశారు. కనీసం జగన్ అయినా అమరావతి విషయంలో క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. ఇప్పటికిప్పుడు బయటపడకపోయినా పర్లేదు, కనీసం 2029 ఎన్నికలనాటికైనా వైసీపీకి ఏపీ రాజధాని విషయంలో ఓ క్లారిటీ వస్తే మేలు, లేకపోతే పులివెందులలో జగన్ కి ఇబ్బంది ఉండదు, మిగతా ప్రాంతాల్లో నాయకులు సమాధానాలు చెప్పుకోలేక సతమతం కావాల్సి ఉంటుంది.

Related News

RK Roja: యాంక‌ర్ వా.. మంత్రివా? అనితపై రెచ్చిపోయిన రోజా

YSR Congress Party: తీవ్ర విషాదం.. వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతి..

Heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Tomato- Onion Prices: భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధర.. రైతులు ఆవేదన..!

Gold Theft: కిలేడీలు.. పట్ట పగలే బంగారం షాపులో చోరీ

Machilipatnam Politics: మచిలీపట్నంలో జనసేన వర్సెస్ వైసీసీ, రంగంలోకి పోలీసులు

Tadipatri Political Tension: తాడిపత్రిలో హై టెన్షన్..పెద్దారెడ్డి ఇల్లు కూల్చివేత ?

Big Stories

×