Belly Fat: ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుందని కొంతమంది చెప్పే మాటలు మీరు కూడా వినే ఉంటారు. చాలా మంది దీనిని ఫాలో అవుతారు కూడా. ప్రస్తుతం చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు బరువు తగ్గాలనుకుంటే.. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకుంటే గోరు వెచ్చటి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి వేడి నీరు నిజంగా సహాయపడుతుందా ?
కేవలం వేడి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి అద్భుతం జరగదు. కానీ ఇది మీ ఆరోగ్యకరమైన జీవనశైలికి సహాయ పడుతుంది.
బరువు తగ్గడానికి సహాయ పడే వేడి నీరు త్రాగటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
ఉదయం గోరువెచ్చని నీరు తాగడం వల్ల కడుపు చురుగ్గా ఉంటుంది. ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. దీని వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
వేడి నీరు చెమట, యూరిన్ ద్వారా శరీరం నుండి మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.
చాలా సార్లు మనం ఆకలికి, దాహానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడంలో ఫేయిల్ అవుతుంటాం. ఉదయం గోరు వెచ్చటి నీళ్లు తాగడం వల్ల అనవసరమైన ఆకలి నియంత్రణలో ఉంటుంది.
బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి, మీరు మరికొన్ని విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి.
వేయించిన, తీపి , ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి.
వాకింగ్, యోగా లేదా తేలికపాటి వ్యాయామంతో రోజును ప్రారంభించండి.
మీరు తగినంత నిద్రపోకపోతే లేదా ఒత్తిడిలో ఉంటే, మీ శరీరంలో బెల్లీ ఫ్యాట్ పేరుకు పోతుంది.
వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగొచ్చా ?
ఉదయం నిద్ర లేచిన వెంటనే 1 గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి.
మీకు కావాలంటే, దానికి నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు.
రోజంతా తక్కువ పరిమాణంలో నీరు త్రాగుతూ ఉండండి. కానీ ఎక్కువగా తాగకండి.
గోరువెచ్చని నీరు తాగడం ఒక సులభమైన, ఆరోగ్యకరమైన అలవాటు.