BigTV English

Allu Arjun: అట్లీ అవుట్.. నెల్సన్ అవుట్.. ఇక త్రివిక్రమ్ తోనే బన్నీ

Allu Arjun: అట్లీ అవుట్.. నెల్సన్ అవుట్.. ఇక త్రివిక్రమ్ తోనే బన్నీ
Advertisement

Allu Arjun: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా మరో నెల రోజుల్లో షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక తరువాత బన్నీ ప్రాజెక్ట్ ఏంటి.. ? అనేది చర్చనీయాంశంగా మారింది.


పుష్ప 2 తరువాత బన్నీ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా ఫైనల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అది కూడా పట్టాలెక్కడం లేదని తెలిసిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో మరో డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.

అట్లీ కూడా ఈ సినిమను కన్ఫర్మ్ చేశాడు. కానీ, కొన్నిరోజుల తరువాత అట్లీ- అల్లు అర్జున్ సినిమా కూడా ఆగిపోయిందని టాక్ నడిచింది. అదే కథను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు అయితే సెట్ అవుతుందని, షారుఖ్ చెప్పడంతో అట్లీ వెంటనే బన్నీని పక్కకు పెట్టినట్లు సమాచారం. ఇక అలా ఈ రెండు కథలు అన్ని చేజారిపోయాయి. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా ప్రస్తుతం బన్నీ ఓకే చేసిన సినిమా త్రివిక్రమ్ ది. ఈ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.


జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు రిలీజ్ అయ్యి ఏ రేంజ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నాలుగోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. త్రివిక్రమ్ .. ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మాములు సినిమాల్లోనే పురాణాల గురించి చెప్పుకొస్తాడు. అలాంటిది ఈ సినిమా మొత్తం పురాణాలకు సంబంధించిదే ఉండబోతుందట. కల్కి లాంటి కథను త్రివిక్రమ్ రెడీ చేస్తున్నాడట. ఇదే కనుక నిజమైతే బన్నీకి మరో హిట్ గ్యారెంటీ అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Tags

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×