Nayanthara: Beyond the Fairy Tale: లేడీ సూపర్ స్టార్ నయనతార.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. ఆమె తన కెరీర్ మొత్తాన్ని వివాదాల మధ్యనే గడిపింది.. గడుపుతూనే వస్తుంది. తన కెరీర్ మొదలు పెట్టిన దగ్గరనుంచి.. విగ్నేష్ తో పెళ్లి అయ్యేంతవరకు కూడా నయన్ వివాదాలు చుట్టూనే తిరిగింది. ఇక తాజాగా తన జీవితం మొత్తం ఒక డాక్యుమెంటరీ రూపంలో రిలీజ్ అయిన విషయం తెల్సిందే.
నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్. నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచే ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నయన్ కెరీర్ మొదలుపెట్టిన దగ్గరనుంచి.. ఇప్పటివరకు ఆమె జీవితంలో జరిగిన వివాదాలు, గొడవలు, రూమర్స్, బ్రేకప్స్, ప్రేమ, పెళ్లి.. ఇలా ఒకటి అని చెప్పడానికి లేకుండా అన్నింటి గురించి చాలా డిటైల్ గా వివరించారు. నయన్, విగ్నేష్, నయన్ డైరెక్టర్స్, నయన్ హీరోస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. ఇలా ఆమె గురించి.. ఒక్కో దశలో ఆమెకు తోడున్నవారు అందరూ ఆమె గురించి చెప్పుకొచ్చారు.
Vishwak Sen’s Mechanic Rocky : ప్రమోషన్సే చేయలేను అన్నాడు… ఇప్పుడు మరీ ఇంతలా రెచ్చిపోయాడు
ముఖ్యంగా నయన్ సినిమాలతో పాటు బాగా ఫేమస్ అయ్యింది హీరోలతో ప్రేమాయణాలు నడపడం వలన. ఆమె జీవితంలో నడిపిన మూడు లవ్ స్టోరీస్ లో.. మూడోది విగ్నేష్ శివన్ కాగా.. అదే నయన్ కు లైఫ్ గా మారింది. కానీ, ముందు ఉన్న రెండు లవ్ స్టోరీస్ వలన నయన్ ఎన్నో వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె పడిన మానసిక క్షోభను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించారు. నయన్ మొదటి ప్రియుడు హీరో శింబు. వీరిద్దరి మధ్య చాలా ఘాటు ప్రేమాయణమే నడిచింది. అప్పట్లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి.
అప్పటికే నయన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. 2006 లో నాగార్జున నటించిన బాస్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలోనే శింబుకు, నయన్ కు మధ్య గొడవలు జరుగుతున్నాయట. ఆ విషయాన్నీ నాగ్ వివరించాడు.
Pushpa 2 Movie : పుష్ప రాజ్ కొత్త మ్యానరిజం ఏంటో తెలుసా?
” షూటింగ్ మొత్తం చాలా బాగా జరిగింది. అందరితోను నయన్ సంతోషంగా మాట్లాడేది. ఆమె సెట్ లో నడుస్తూ వస్తుంటే.. ఒక రాజసం కనిపించేది. ఎంతో నిజాయితీగా మాట్లాడేది. అందుకే నాకు తనతో స్నేహం చేయడం చాలా ఇష్టం. బాస్ సినిమా చేసేటప్పుడు నయన్ చాలా సంతోషంగా ఉండేది. షూటింగ్ లో భాగంగా స్విజర్లాండ్ వెళ్లాం. చెప్పాలంటే.. తను రిలేషన్ షిప్ లో ఎక్కడలేని టెన్షన్ ఫేస్ చేసింది.
ఫోన్ రింగ్ అయితే చాలు మా అందరికి భయమేసేది. ఆ ఫోన్ రింగ్ అయితే తన మూడ్ మొత్తం పాడైపోయేది. మొహం మొత్తం మారిపోయేది. నేను తనకు చాలా సార్లు చెప్పాను. ఎందుకు నీకు ఇవన్నీ.. నీకంటూ ఒక పేరు ఉందని చెప్పాను” అని చెప్పుకొచ్చాడు.
Nayanthara – Dhanush : హీరో ధనుష్‌కు నయన్ మాస్ వార్నింగ్… కత్తితో వేటాడటమే
ఇక నయన్ సైతం.. నా మొదటి రిలేషన్ పై నేను చాలా నమ్మకాన్ని పెట్టుకున్నాను. వాళ్లు కూడా మనల్ని నమ్ముతారు, ప్రేమిస్తారు అని అనుకుంటాం. జనాలు వారికి నచ్చినట్లు ఊహించుకున్నారు. అదే నా మనసు ముక్కలు అయ్యేలా చేసింది” అని చెప్పుకొచ్చింది. నయన్.. తన మాజీ ప్రేమికుల పేర్లు తీసుకురాకపోయినా నెటిజన్స్ మాత్రం నయన్ ను శింబు ఇంత వేధించాడా.. ? అంతలా చీట్ చేశాడా.. ? అని మాట్లాడుకుంటున్నారు.