BigTV English
Advertisement

Mahabharat Movie : బాలీవుడ్‌కు అల్లు ‘అర్జునుడు’ దొరికేశాడు

Mahabharat Movie : బాలీవుడ్‌కు అల్లు ‘అర్జునుడు’ దొరికేశాడు

Mahabharat Movie : బాలీవుడ్ వాళ్లు పురాణాలపై పడ్డారు. ఇప్పటికే రామయణ్ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పుడు మహాభారతం పైన కూడా మూవీ రాబోతుంది. దీన్నీ బాలీవుడ్ దిగ్గజ హీరో అమీర్ ఖాన్ డీల్ చేస్తున్నాడు. ఆయనకున్న డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో మహా భారతం అని ఈ మధ్య చెప్పాడు. దీనిపై ఇప్పటి నుంచే వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.


ఈ క్రమంలో మహా భారతంలోని పాత్రను ఫిక్స్ చేసే పనిలో అమీర్ ఖాన్ ఉన్నాడట. ఇప్పటికే కొన్ని పాత్రలకు నటీనటుల సెలక్షన్ పూర్తి అయినట్టు సమాచారం. తాజాగా మరో ప్రధానమైన పాత్రకు ఓ పాన్ ఇండియా నటుడ్ని ఫిక్స్ చేశారట.

లాల్ సింగ్ చద్దా మూవీ డిజాస్టర్ తర్వాత అమీర్ ఖాన్… కొద్ది రోజుల పాటు యాక్టింగ్ దూరంగా ఉన్నాడు. ఈ మధ్య కొన్ని సినిమాల్లో స్పెషల్ గెస్ట్ రోల్స్ చేస్తున్నాడు. అలాగే ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నాడు. అయితే ఇటీవల తాన డ్రీమ్ ప్రాజెక్ట్ మహా భారతం అని అమీర్ ఖాన్ చెప్పాడు.


అలాగే, మహా భారతంలో తనకు కృష్ణుడి పాత్ర చేయాలని ఉందని కూడా చెప్పుకొచ్చాడు. దీంతో పాటు మహా భారతంలో ఉన్న ఇతర పాత్రలను కూడా ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా బాలీవుడ్ లో వస్తున్న టాక్ ప్రకారం… మహా భారతంలోని అర్జునుడి పాత్రకు ఓ పాన్ ఇండియా స్టార్ ను ఫిక్స్ చేశారట. ఆయన ఎవరో కాదు… పుష్ప 2 తో పాన్ ఇండియా హీరో అయిన అల్లు అర్జున్.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ పూర్తిగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన అట్లీతో ఓ భారీ మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ జూన్ రెండో వారం నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం. దీని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ మూవీ రాబోతుంది. అది సోషియో మైథలాజికల్ ఫాంటసీ జోనర్‌లో ఉంటుందని నిర్మాత నాగ వంశీ ఇప్పటికే చెప్పారు.

దీంతో పాటు మహా భారతంలో కూడా అల్లు అర్జున్ నటించబోతున్నట్టు తెలుస్తుంది. మహా భారతంలో ప్రధానమైన పాత్రలో అర్జునుడి పాత్ర కూడా ఒకటి. అలాంటి పాత్ర చేయాలనే ఛాన్స్ వస్తే బన్నీ అసలు వదులుకోలేడు. అందుకే అమీర్ ఖాన్ చెప్పడంతోనే… బన్నీ వెంటనే ఒప్పుకున్నట్టు సమాచారం.

ఇటీవల ముంబైలో అమీర్ ఖాన్ తో అల్లు అర్జున్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా గాసిప్స్ వచ్చాయి. ఇద్దరి మధ్య మల్టీ స్టారర్ అంటూ, అమీర్ ఖాన్ బ్యానర్ లో అల్లు అర్జున్ కొత్త మూవీ అని, అట్లీ – అల్లు అర్జున్ మూవీలో అమీర్ ఖాన్ ను గెస్ట్ రోల్ చేయమని అడగడానికే ఈ మీటింగ్ అంటూ చాలా గాసిప్స్ వచ్చాయి.

అయితే… అమీర్ ఖాన్ ను అల్లు అర్జున్ కలవడానికి అసలైన కారణం ఇదే అని ఇప్పుడు అటు బాలీవుడ్ సర్కిల్స్, ఇటు టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా… అర్జునుడి పాత్రలో అల్లు అర్జునుడు అంటే వేరే లెవల్ లో ఉంటుందని బన్నీ అభిమానులు అంటున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×