Arya 2 Re Release Collections :ఒకప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమాను మళ్ళీ చూడాలి అంటే టీవీలో వాళ్ళు వేసే వరకు ఎదురు చూడాలి. లేకపోతే క్యాసెట్లు లాంటివి అందుబాటులో ఉండేవి. అయితే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇప్పుడు ఓటిటి ప్లాట్ఫామ్స్ అంటూ పలు డిజిటల్ ఎంటర్టైనింగ్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ప్రేక్షకులు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సినిమా చూడాలనుకున్నా సరే ఇలాంటి వెసులుబాటు కూడా కల్పించ పడింది. ఇదిలా ఉండగా ఇప్పుడు గతంలో విడుదలైన చిత్రాలను థియేటర్లలో మళ్ళీ రిలీజ్ చేసి ఆడియన్స్ కి పాత సినిమాలను గుర్తు చేయడమే కాకుండా నిర్మాతలకు భారీ లాభాన్ని మిగులుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా దాదాపు రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించిన సినిమాల జాబితా వైరల్గా మారింది. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ..రీ రిలీజ్ లో కూడా పుష్పరాజ్ సినిమా సత్తా చాటుతూ భారీ కలెక్షన్లు వసూల్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మరి ఆ సినిమా ఏంటి? ఇప్పటివరకు రీ రిలీజ్ లో రూ.5 కోట్లకు కు పైగా కలెక్షన్లు సాధించిన చిత్రాలు ఏమిటి ? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఖుషి:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్గా ఎస్. జే .సూర్యా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖుషి. ఈ సినిమా అప్పట్లో యువతను ఎంతగా ఆకట్టుకుంది అంటే ఇప్పుడు రిలీజ్ లో కూడా అంతే విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా భూమిక, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే నడుము సీన్ కోసమే చాలామంది థియేటర్లకు వచ్చిన వారు కూడా ఉన్నారు. అటు మ్యూజిక్ పరంగా, పాటలు అన్నీ కూడా ఏదో మ్యాజిక్ చేసేసాయి. దీంతో రీ రిలీజ్ లో ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
సింహాద్రి:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, భూమిక కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా రీ రిలీజ్ లో రూ. 5కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఎన్టీఆర్ యాక్షన్ పర్ఫామెన్స్ కి అభిమానులు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. ఇక 4K లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందించింది.
బిజినెస్ మాన్:
మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన బిజినెస్ మాన్ సినిమా కూడా రీరిలీజ్ లో 4k లో రిలీజ్ అయ్యి రూ.5కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
మురారి:
మహేష్ బాబు హీరోగా, సోనాలి బింద్రే హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా ఒక మాయ చేసింది. ఇందులో మహేష్ బాబు లుక్ కోసం అమ్మాయిలు ఎగబడ్డారు.4Kలో రీ రిలీజ్ అయ్యి రూ.5కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసింది.
గబ్బర్ సింగ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా రీ రిలీజ్ లో ఫోర్ కేలో రిలీజ్ అయ్యి రూ .5కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:
మహేష్ బాబు , వెంకటేష్ మల్టీస్టారర్ గా అంజలి, సమంత, అభినయ, ప్రకాష్ రాజ్ , జయసుధ తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ విడుదలైన ఈ సినిమా ఇటీవల 4k లో రీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు నాటి గుర్తులను మళ్లీ అభిమానులకు అందించింది.
ఆర్య 2:
నవదీప్ ,అల్లు అర్జున్ , కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో సుకుమార్ దర్శకత్వంలో.. ఆర్య సీక్వెల్ గా వచ్చిన చిత్రం ఆర్య 2 . ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేదు కానీ రీ రిలీజ్ లో ఇటీవల ఫోర్ కే లో రిలీజ్ అయ్యి అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసింది. అంతేకాదు రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఏడవ చిత్రంగా నిలిచింది. రీ రిలీజ్ లో కూడా పుష్పరాజ్ హవ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.