Allu Arjun: ఒక హీరోకు ఒక సినిమా వల్ల నెగిటివిటీ వచ్చిందంటే మరొక సినిమా విడుదలయ్యి అది హిట్ కొట్టేవరకు ఆ నెగిటివిటీ అలాగే ఉండిపోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఐకాన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నా కూడా అల్లు అర్జున్‌పై నెగిటివిటీ మాత్రం ఒక రేంజ్‌లో ఏర్పడింది. ‘పుష్ప 2’తో గ్లోబల్ రేంజ్‌లో హిట్ కొట్టినా తనకు అభిమానుల కంటే హేటర్సే ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆ మూవీ అంత పెద్ద హిట్ అయినా కూడా కొన్నాళ్లు ప్రేక్షకులకు టచ్‌లో ఉండకుండా సైలెంట్ అయ్యాడు బన్నీ. ఇక ఇన్నాళ్ల తర్వాత తాజాగా అట్లీ దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. ఇంకా మూవీ మొదలవ్వక ముందే దీనిపై ట్రోల్స్ వచ్చేస్తున్నాయి.
పోస్టర్‌తోనే మొదలు
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని చాలాకాలంగా ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా దీనికి సంబంధించి ఎన్నో రూమర్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. కానీ మేకర్స్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇక తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీతోనే సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేసింది టీమ్. అంతే కాకుండా ఈసారి నేషనల్ లెవెల్‌లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఏదో జరగబోతుందని ముందే హింట్ ఇచ్చింది. ఇక ఈ మూవీని అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన వీడియో ఒక రేంజ్‌లో వైరల్ అయ్యింది. అంతా బాగానే ఉన్నా.. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌పైనే ట్రోల్స్ మొదలయ్యాయి.
కాపీ కొట్టారు
అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్‌లో 22వ సినిమా, అట్లీ కెరీర్‌లో 6వ సినిమా అని చెప్తూ వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీని ప్రకటిస్తూ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. కానీ ఆ పోస్టర్ చూస్తుంటే అదొక సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ పోస్టర్‌తో పోలి ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ‘డ్యూన్’ సినిమా పోస్టర్‌ను కాపీ కొట్టి అల్లు అర్జున్ కొత్త మూవీ పోస్టర్ తయారు చేశారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యింది. పైగా ఈ రెండు పోస్టర్లను పక్కపక్కనే పెట్టి ఏం తేడా లేదంటూ నెటిజన్లు దీని గురించి తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ మరోసారి ట్రోల్ కంటెంట్ అయిపోయాడని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Also Read: 25 కోట్లు నష్టపోయిన ప్రభాస్.. ఏం జరిగిందంటే.?
హాలీవుడ్ రేంజ్‌లో
‘పుష్ప’ అనే సినిమా ఒక మాస్ కథతో తెరకెక్కించినా కూడా అది దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. కానీ అట్లీ (Atlee) సినిమా అలా కాదని అనౌన్స్‌మెంట్‌తోనే అర్థమయిపోయింది. ఈ సినిమా కోసం పలు హాలీవుడ్ సంస్థలను సంప్రదించారు మేకర్స్. హాలీవుడ్‌లో పెద్ద పెద్ద సినిమాలకు గ్రాఫిక్స్, యానిమేషన్స్ అందించిన స్టూడియోలను సంప్రదించి, ఆ క్రియేటర్స్‌తో మాట్లాడి అల్లు అర్జున్‌తో చేసే సినిమా కోసం భారీ ఎత్తులో ప్లాన్ చేస్తున్నాడు అట్లీ. ఇక ఆ క్రియేటర్స్ అంతా స్క్రిప్ట్ చదివి కథ అదిరిపోయింది అంటూ పాజిటివ్ రివ్యూలు కూడా ఇచ్చారు. దీంతో ఎంత నెగిటివిటీ వస్తున్నా అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోతోంది.
The film has not been started yet, and already copy paste started?#Dune #AA22xA6 #AlluArjun #Atlee #AA22 #A6
Dune VS AA22 x A6 pic.twitter.com/7CHf0gZHMY
— Aminul Hoque (@RoccoAminul) April 9, 2025