Prabhas:రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలను ప్రకటిస్తూ.. బిజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన విడుదల చేయబోయే చిత్రాల లిస్టులో ప్రముఖ డైరెక్టర్ మారుతి (Maruti) దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ (Rajasaab ) సినిమా ఉంది. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు ప్రభాస్. మరొకవైపు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తో ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా మారిన ప్రభాస్..
ఇక ఈ రెండు ప్రాజెక్టులు ఇలా ఉంటే.. మరొకవైపు సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ ను సరికొత్త లుక్ లో చూపించడానికి సిద్ధం చేస్తున్నారు సందీప్.ముఖ్యంగా ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు డైరెక్టర్ సందీప్ ప్రభాస్ కి కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇందులో కనిపించాలి కాబట్టి.. మరో తొమ్మిది నెలల పాటు ఇంకో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఈ తొమ్మిది నెలల సమయం తనకే కేటాయిస్తే వెంటనే సినిమా పూర్తి చేస్తానని కూడా తెలిపారు. వీటితోపాటు ప్రశాంత్ నీల్ సలార్ -2, నాగ్ అశ్విన్ కల్కి -2 సీక్వెల్స్ ను తెరకెక్కించే పనిలో ఉన్నారు.
రూ.25 కోట్లు పోగొట్టుకున్న ప్రభాస్..
ఇలా తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్ కి.. ఒక బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్ లో నటించాలని ఆఫర్ వచ్చిందట.అసలే వరుస చిత్రాలను ప్రకటించి, పలు ప్రాజెక్టులతో నిర్విరామంగా సినిమాలను పూర్తి చేసే పనిలో పడిన ఈయనకు.. ఇప్పుడు ఇలా బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ లో నటించాలని ఆఫర్ రావడంతో ప్రభాస్ ఎటు తేల్చుకోలేకపోయారట. ముఖ్యంగా మూడు రోజుల వర్కింగ్ డేస్ కి గానూ.. ప్రభాస్ కి ఏకంగా రూ.25 కోట్లు ఆఫర్ ఇచ్చారు. అయితే ప్రభాస్ మాత్రం సింపుల్గా నో చెప్పారట. మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఇప్పటికే మహేష్ బాబు(Maheshbabu ), అల్లు అర్జున్ (Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR ) పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ ఉన్న బిజీ షెడ్యూల్లో ఇది అయ్యే పని కాదు. అందుకే ప్రభాస్ మొదటి నుండి ఈ యాడ్ షూట్ కి నో చెబుతూనే ఉంటారు. ఏది ఏమైనా ఇప్పుడు తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగానే రూ.25 కోట్లు మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక మొత్తానికి అయితే ప్రభాస్ ఇప్పుడు తన సినిమాలను విడుదల చేసే పనిలో పడ్డారు.
బిజీ షెడ్యూల్స్ కారణంగా వ్యక్తిగత జీవితానికి దూరమే..
ఇకపోతే ప్రస్తుతం ఇలా వరుస షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్.. వ్యక్తిగత జీవితానికి కూడా దూరమయ్యారనే చెప్పాలి. పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా అభిమానులు వేడుకుంటున్నా.. ప్రభాస్ మాత్రం తనకేమి పట్టనట్టుగా తన కెరియర్ పైనే ఫోకస్ పెడుతూ దూసుకుపోతున్నారు. అందుకే కేవలం సినిమాల కోసమే.. అటు వ్యక్తిగత జీవితానికి దూరం అవడమే కాకుండా ఇటు అంది వచ్చిన ఆఫర్లను కూడా దూరం చేసుకుంటున్నారు అంటే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Kalyan Ram: నిస్వార్థమైన ప్రేమ ఆమెదే.. కళ్యాణ్ రామ్ మాటలకు ఫ్యాన్స్ ఈలలు..?