BigTV English

Mahesh Kumar Goud: బీజేపీ నేతలకు ఫ్యాషన్‌.. మాకు ఆరాధ్య దైవం

Mahesh Kumar Goud: బీజేపీ నేతలకు ఫ్యాషన్‌.. మాకు ఆరాధ్య దైవం

Mahesh Kumar Goud:  అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల వ్యవహారాన్ని తీవ్రతరం కాంగ్రెస్ పార్టీ. అమిత్ షా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఏఐసీసీ పిలుపు మేరకు నిరసనను తీవ్రతరం చేసింది టీపీసీసీ. అంబేద్కర్‌ మాకు దేవుడితో సమానమన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్.


అంబేద్కర్ పేరు బీజేపీ నేతలకు ఫ్యాషన్‌ అయ్యిందన్నారు. మనుస్మృతి అమలు చేసేందుకు బీజేపీ- సంఘ్ పరివార్ కుట్ర తెరలేపిందన్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరసనలు తీవ్రతరం చేసింది.

అంబేద్కర్ పేరు లక్షల సార్లు కాదు.. కోట్ల సారైనా తాము స్మరిస్తూనే ఉంటామన్నారు. తక్షణమే అమిత్‌షాను కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అమిత్‌షాపై చర్యలు తీసుకునేంతవరకూ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.


షా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి నిరసనలు చేస్తే కుట్రపూరితమైన కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజావ్యతిరేకతను గమనించి ఇప్పటికైనా అమిత్‌షాపై ప్రధాని నరేంద్రమోదీ చర్యలు తీసుకోవాలన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలతో బీజేపీ ముసుగు తొలిగిపోయిందని, ఆయన వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమన్నారు.

ALSO READ: అసదుద్దీన్ ఒవైసీకి కష్టాలు, ఆపై కోర్టు నోటీసు

దేవుడి పేరు వాడుకొని రాజకీయ లబ్ది పొందడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. మనుస్మృతి, సావర్కర్‌ను అనుసరించే మీరు అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి మీ నిజ స్వరూపాన్ని బట్టబయలు అయ్యిందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి పెద్దఎత్తున కాంగ్రెస్ పోరాడుతోందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×