Allu Arjun donetes whopping rs 1-crore for ap and telangana flood victims: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చాయి. చాలా ప్రాంతాలు ఆనవాలు లేకుండా పోయాయి. ఈ వరదలు రెండు రాష్ట్రాలకు ఎంత నష్టాన్ని మిగిల్చాయో అంతకుమించిన దుఖ్ఖాన్నీ.. దానికి మించిన పాఠాలను కూడా నేర్పుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా కురిసిన వర్షాలతో, వరద తాకిడితో జాతీయ రహదారులు సైతం కొట్టుకుపోయాయి. రహదారులపై వంతెనలు తెగిపోయాయి. ఏపి, తెలంగాణ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పలుచోట్ల రైల్వే ట్రాక్ లకు నష్టం కలగడంతో అధికారులు రైళ్లను దారిమళ్లించారు. తెలంగాణకు సంబంధించి, ఖమ్మం జిల్లాలో నష్టం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ పెద్ద మొత్తంలో వరదనీరు ఉండడంతో నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేయలేకపోతున్న పరిస్థితి ఉంది. సుమారు 400 – 500 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తెలుగు రాష్ట్రాలకు అండగా నిలిచారు. ఒక్కో రాష్ట్రానికి 50 లక్షల చొప్పున.. కోటీ రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
Also Read: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం
కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయంచేసే వారిలో సోనూ సూద్ ఒకరు. తాజాగా ఆయన మరో గొప్ప మనసును చాటుకున్నారు. ఏపీ, తెలంగాణ వరద బాధితుల కోసం సోనూ సూద్ రెండు కోట్ల విరాళం ప్రకటించారు. అదేవిధంగా తన ట్రస్ట్ ద్వారా బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
మరో వైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు భార్య, హెరిటేజ్ ఫుడ్స్ ఎండి నారా భువనేశ్వరి రెండు కోట్ల విరాళం ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయనిధికి కోటి చొప్పున విరాళం అందించారు.
ఇక, ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ ఏపీ, తెలంగాణా వరద బాధితుల కోసం తమ వంతు సాయం చేసిన సంగతి తెలిసిందే..
I'm saddened by the loss and suffering caused by the devastating rains in Andhra Pradesh and Telangana. In these challenging times, I humbly donate ₹1 crore in total to the CM Relief Funds of both states to support the relief efforts. Praying for everyone's safety 🙏.…
— Allu Arjun (@alluarjun) September 4, 2024