BigTV English

Allu Arjun : బాధితురాలికి ఆఫర్, నిందితుడికి బెయిల్… బన్నీ డబుల్ ఫేస్డ్ వేషాలు అందుకేనా?

Allu Arjun : బాధితురాలికి ఆఫర్, నిందితుడికి బెయిల్… బన్నీ డబుల్ ఫేస్డ్ వేషాలు అందుకేనా?

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ ముహూర్తాన పుష్ప 2 మూవీని మొదలు పెట్టాడో గానీ, అప్పటి నుంచి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆయన జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి అండగా నిలవడంపై కూడా ట్రోలింగ్ జరుగుతుంది. డబుల్ పేస్డ్ అంటూ అంతకు ముందు ఆయన చేసిన తప్పును ఎత్తి చూపుతున్నారు నెటిజన్లు.


అల్లు అర్జున్ డబుల్ ఫేస్డ్ వేషాలు బట్టబయలు

తాజాగా టాలీవుడ్ ను ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఊపేస్తున్న విషయం తెలిసిందే. బాధితురాలిని మైనర్ గా ఉన్నప్పటి నుంచే లైంగికంగా వేధించాడని, ఆమెను మతం మారి తనను పెళ్లి చేసుకోమంటూ వేధించాడనే ఆరోపణలు జానీ మాస్టర్ పై వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అంతలోపు ఆయనపై పడాల్సిన పిడి పడింది. ఓవైపు జనసేన పార్టీ కార్యక్రమాలకు హాజరు కావద్దంటూ జానీ మాస్టర్ కు అఫీషియల్ గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మరోవైపు డాన్సర్ అసోసియేషన్ కు దూరంగా ఉండాలంటూ ఫిలిం ఛాంబర్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఒక అడుగు ముందుకేసి జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన బాధితురాలికి భరోసా ఇచ్చారు. తను నెక్స్ట్ చేయబోయే సినిమాలతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాబోయే సినిమాలలో కూడా ఛాన్స్ ఇస్తానంటూ ఫోన్ చేసి మరీ చెప్పారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. కానీ బన్నీ హేటర్స్ మాత్రం ఈ విషయంలో బన్నీ స్వార్థం చూసుకుంటున్నాడు అంటూ ఏకిపారేస్తున్నారు. ఇప్పుడేమో బాధితురాలికి అండగా నిలుస్తానని చెబుతున్నాడు. గతంలో ఇలాంటి ఆరోపణల వల్లే ఒక యువతి ఆత్మహత్యకు కారణమైన పుష్ప నటుడు జగదీష్ ప్రతాప్ బండారిని బెయిల్ పై బయటకు తీసుకొచ్చాడు అని గుర్తు చేస్తున్నారు. బాధితురాలికి ఆఫర్ ఇస్తానంటూ అండగా నిలబడడం మంచి విషయమే అయినప్పటికీ గతంలో ఈ బుద్ధి ఏమైంది అంటూ నిలదీస్తున్నారు.


Pushpa 2: Allu Arjun Is Going To Become The Neil Armstrong Of The Telugu  Industry, A Record That Will Immortalize Him In Indian Cinema! - Gondwana  University

స్వార్థం కోసమే బన్నీ ఈ పని చేశాడా?

అయితే గత కొంతకాలం నుంచి పుష్ప 2 మూవీ రిలీజ్ పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అందులో షూటింగ్ ఆలస్యమవడం, సుకుమార్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు రావడం అనే రూమర్లు ఒక ఎత్తైతే, రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకపోవడం వల్ల వచ్చిన నెగెటివిటీ నేపథ్యంలో సినిమాను పోస్ట్ పోన్ చేశారు అనేది మరో వర్గం వారు అనే మాట. ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బాధితురాలికి అండగా నిలిచే నెపంతో ఇప్పటిదాకా ఆయనపై ఉన్న నెగిటివిటీకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. అలాగే పనిలో పనిగా పుష్ప 2 మూవీపై కూడా దీనివల్ల కొంతవరకు పాజిటివిటీ ఏర్పడవచ్చు కాబట్టి జానీ మాస్టర్ కేసును అల్లు అర్జున్ క్యాష్ చేసుకుంటున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×