Fire Accident in Turkey: టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బోల్ ప్రావీన్స్‌లోని కార్టల్‌కాయా ప్రావీన్స్‌లోని స్కీ రిసార్ట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. 32 మంది మరణించారు.
12 అంతస్తుల ఈ హోటల్‌లో తెల్లవారుజామున మూడున్నర గంటకు మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో హోటల్‌లో మొత్తం 234 మంది ఉన్నారు. భయంతో ఇద్దరు భవనం పైనుంచి దూకడంతో మరణించారు. మిగతా ఎనిమిది మంది అగ్నికి ఆహుతయ్యారు.
మంటల సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం అధికారులు ఫోకస్ చేశారు. మొత్తం ఆరు టీమ్‌లను రంగంలోకి దింపారు. అయితే బయట కలప ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెంది ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
Also Read: అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్.. కంబ్యాక్ ప్రెసిడెంట్‌గా రికార్డ్
టర్కీలోని ప్రముఖ టూరిస్ట్ అట్రాక్షన్‌లలో ఈ ప్రాంతం ఒకటి. కర్తాల్కాయ అనేది ఇస్తాంబులకు తూర్పున 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన మహా నగరం. ఇది ఆసియా ఐరోపాలో విస్తరించి ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి స్కీయింగ్ చేయడానికి వస్తారు. ఇలాంటి ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.