Allu Arjun : డిసెంబర్ 4న హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆ కేసులో భాగంగా అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంలోనే అల్లు అర్జున్ గురించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా సరే క్షణాలో వైరల్ గా మారుతుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నారు? ఎవరెవరు సైలెంట్ గా ఉంటున్నారు? ఆయనను సందర్శించడానికి ఎవరెవరు వెళ్తున్నారు? వంటి విషయాల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంస్టాగ్రామ్ లో హయ్యెస్ట్ ఫాలోయింగ్ కలిగిన నెంబర్ వన్ స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్… కేవలం ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారన్న వార్త మరోసారి వైరల్ అవుతుంది.
‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కేసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గాయపడ్డ ఆమె కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండా అక్కడికి రావడం వల్లే ఈ ఘటన జరిగిందంటూ పోలీసులు కేసును నమోదు చేశారు. దీంతో శుక్రవారం పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా, నాంపల్లి హైకోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. తరువాత చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ ని తరలించారు. కానీ హైకోర్టు మధ్యంతరం బెయిల్ ఇవ్వడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. కానీ ఒక రాత్రి ఆయన జైల్ లోనే గడపాల్సి వచ్చింది.
‘పుష్ప 2’తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun)… ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండానే ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఇక మరోవైపు ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ అయిన 9 రోజుల్లోనే 1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక తాజాగా జరిగిన సంఘటనతో అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పాలి. అందులోనూ ఇంస్టాగ్రామ్ లో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న నెంబర్ వన్ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. ఆయనకు ఇన్స్టాగ్రామ్ లో దాదాపు 28 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉండటం విశేషం.
అయితే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ (Allu Arjun) మాత్రం కేవలం ఒకే ఒక్కరిని తన ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. ఆ ఒక్కరు ఎవరో కాదు ఆయన భార్య స్నేహ రెడ్డి (Allu Sneha Reddy). తన భార్యను తప్ప అల్లు అర్జున్ ఎవ్వరినీ ఫాలో అవ్వకపోవడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లాంటి వారిని కూడా ఫాలో కాకపోవడం గమనార్హం. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో చిరంజీవి తన భార్యతో సహా అల్లు అర్జున్ పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లారు. ఇక ప్రస్తుతం పరామర్శలో భాగంగా అల్లు అర్జున్ ఇంటికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వస్తూ వెళ్తుండంతో హడావిడి నెలకొంది.