Rashmika Mandanna: సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ డేటింగ్ అనేది సహజం. కానీ ఆ విషయాన్ని ఓపెన్‌గా చెప్పడానికి నటీనటులు ఇష్టపడరు. అందుకే కొందరు హీరోహీరోయిన్ల పర్సనల్ లైఫ్‌పై ఎన్ని రూమర్స్ వచ్చినా వాటిపై స్పందించడానికి వారు ఇష్టపడరు. అలాంటి లిస్ట్‌లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రష్మిక మందనా (Rashmika Mandanna) పేరు కూడా ఉంటుంది. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారనే విషయం చాలాసార్లు బయటపడింది. అయినా కూడా ఓపెన్‌గా ఒప్పుకోవడానికి ఇద్దరూ సిద్ధంగా లేరు. ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తున్నా కూడా డైరెక్ట్‌గా మాత్రం తమ ప్రేమ వ్యవహారం గురించి ఈ జంట కామెంట్స్ చేయడం లేదు. తాజాగా విజయ్ దేవరకొండ చేసిన ఒక సాయం గురించి గుర్తుచేసుకొని ఆసక్తికర కామెంట్స్ చేసింది రష్మిక.
విజయ్‌కు ఫోన్ చేశాను
ఇటీవల అల్లు అర్జున్‌తో రష్మిక కలిసి నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2) ఒక రేంజ్‌లో సక్సెస్ సాధించింది. ఈ మూవీలో చాలావరకు అల్లు అర్జునే హైలెట్ అయినా రష్మిక కూడా పలు సీన్స్‌లో పరవాలేదనింపించింది. ముఖ్యంగా జాతర సీన్‌లో అల్లు అర్జున్ నటనతో పాటు రష్మిక నటనకు కూడా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఆ సీన్‌లో తాను ఎలా నటిస్తానో అని రష్మిక చాలా టెన్షన్ పడిందట. అదే విషయాన్ని తాజాగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఆ సీన్ చేయడానికి చాలా టెన్షన్ పడ్డానని, అందుకే సాయం కోసం విజయ్ దేవరకొండను ఫోన్ చేశానని బయటపెట్టింది. ఇప్పుడు మాత్రమే కాదు.. ఎప్పుడైనా తను ముందుగా ఫోన్ చేసి సాయం అడిగే వ్యక్తి విజయ్ అని పలుమార్లు చెప్పుకొచ్చింది రష్మిక.
Also Read: రష్మికపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో.. ‘పుష్ప 2’పై ఆసక్తికర కామెంట్స్
ఐడియా ఇచ్చాడు
‘‘పుష్ప 2లోని జాతర సీన్ నా చేతికి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని అర్థం కాలేదు. అందుకే విజయ్‌కు ఫోన్ చేశాను. ఆ ఒక్క సీన్ గురించే తనతో మాట్లాడాను. ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదని అన్నాను. తను నాకొక ఐడియా ఇచ్చాడు. అది నాకు ఆసక్తికరంగా అనిపించి అలాగే చేశాను. సినిమా ప్రీమియర్ సమయంలోనే ఆ సీన్‌ను మొదటిసారి చూశాను. నేను చెప్పిన డైలాగ్‌కు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. యానిమల్ సినిమాలో అలాంటి సీన్‌కే ప్రేక్షకులు నన్ను ట్రోల్ చేశారు. అందుకే పుష్ప 2 సీన్‌పై కూడా నాకు అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ సీన్‌ను ప్రేక్షకులు ప్రశసించడం చూస్తుంటే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి’’ అని చెప్పుకొచ్చింది రష్మిక.
వెరీ బిజీ
మొత్తానికి విజయ్ చెప్పిన ఐడియాతో నటించి ఆ సీన్‌లో చాలామంది నటించిందంటూ రష్మికను ప్రశంసిస్తున్నారు ఫ్యాన్స్. తన నటనతో రోజురోజుకీ తన ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్న రష్మిక.. చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అంతే కాకుండా పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ కూడా కొట్టేసింది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లకు కూడా పోటీ ఇస్తూ భారీ హిందీ ప్రాజెక్ట్స్ అన్నీ తన ఖాతాలో వేసుకుంటోంది.