Chandu Mondeti: ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి (Chandu Mondeti) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిఖిల్ (Nikhil) హీరోగా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. ఈ చిత్రానికి దర్శకత్వం వహించి,పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు దక్కించుకున్నారు. ఈ సినిమా కంటే ముందు ‘కార్తికేయ’ చిత్రంతో కూడా భారీ విజయాన్ని అందుకున్నారు.ఇక ఇప్పుడు గీత ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా వస్తున్న ‘తండేల్’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే దర్శకుడు మాట్లాడుతూ రాజమౌళి (Rajamouli) పై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని తన మాటల్లో చెప్పుకొచ్చారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం
చందు మొండేటి పూజ గదిలో ఆ దర్శకుల ఫోటోలు..
తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించిన డైరెక్టర్లలో రాజమౌళి ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయనను దేవుడిగా ఆరాధించే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో తండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి కూడా ఒకరు. తాజాగా జక్కన్నపై తనకున్న అభిమానాన్ని ఆయన చాటుకున్నారు. ఇక ఇదే విషయంపై ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కూడా.. ఇక ఇంటర్వ్యూలో భాగంగా రాజమౌళి, శంకర్ (Shankar), మణిరత్నం(Maniratnam), సుకుమార్ (Sukumar) లు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగమని, వాళ్లు లేకపోతే తాను ఈ స్థాయిలో ఈరోజు ఉండేవాడినే కాదు అంటూ తెలిపారు. ఇక తండేల్ సినిమా చందు మొండేటికి ఒక ‘రోజా’ అవుతుందా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా .. నన్ను అంతటి డైరెక్టర్ తో పోల్చకండి. నా వరకు రాజమౌళి, మణిరత్నం, శంకర్ లాంటి వాళ్ల పేర్లు వింటేనే నాకు వణుకు వస్తుంది. మీరు నమ్ముతారో లేదో గానీ రాజమౌళి ఫోటో మా ఇంట్లో దేవుడి పటాల పక్కనే ఉంటుంది. ఒకవైపు కృష్ణుడు మరొకవైపు శివుడు ఇలా రాజమౌళితో పాటు శంకర్, మణిరత్నం డైరెక్టర్ల ఫోటోలు కూడా ఉంటాయి. వాళ్లంటే నాకు అంత భక్తి, గౌరవం కూడా. రాజమౌళి ఫోటో ఇప్పుడు కాదు ‘మగధీర’ సినిమా సమయం నుంచే మా ఇంట్లో పూజ గదిలో ఉంది. వాళ్లతో పాటు సుకుమార్ లాంటి డైరెక్టర్ అంటే కూడా నాకు ఎంతో గౌరవం. వాళ్ళు లేకుండా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండే వాడినే కాదు అంటూ చెప్పుకొచ్చారు చందు మొండేటి. ఇక ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తండేల్ సినిమా విశేషాలు..
తండేల్ సినిమా విషయానికి వస్తే.. నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన చిత్రం ఇది. ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కాబోతోంది. శ్రీకాకుళం మత్స్యకారుల జీవితంలో జరిగిన ఒక కథగా సినిమాను తెరకెక్కించారు. మత్స్యకారుడి పాత్రలో చైతన్య నటిస్తున్నారు. పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి వెళ్లి అనుకోకుండా ఆ దేశ నేవీకి చిక్కిన మన మత్స్యకారులు చుట్టూ తిరిగే కథ ఇది. ప్రేమ కథకు దేశభక్తిని జోడించి చాలా అద్భుతంగా తెరకెక్కించారు.ఇకపోతే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా.. ఈ ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.