Manchu Mohan Babu : గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న ఫ్యామిలీ వివాదాలు మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో అవి మరి బహిరంగంగా జరుగుతున్నాయి. వాస్తవానికి మంచి మనోజ్ మనుషులని విష్ణు ఇంటికొచ్చి కొట్టిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. విష్ణు కొట్టాడు అనే విషయం మనోజ్ అరుస్తూ చెప్పడం వల్లనే అందరూ దానిని నిజమైన నమ్మారు. అయితే ఆ తర్వాత ఇదంతా కేవలం ఒక రియాలిటీ షో కోసమే చేస్తున్నాం అని మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. ఇప్పటికీ ఆ రియాల్టీ షో బయటకు రాలేదు. అయితే నిజం నిప్పులాంటిది ఎక్కువకాలం దాగదు అని చెప్పినట్లు మొత్తానికి వీళ్ళు ఇంట్లో జరుగుతున్న వివాదాలు అన్ని బయటికి వచ్చేసాయి. ఏకంగా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకునే స్థాయి వరకు ఈ కుటుంబ సమస్యలు వచ్చేశాయి.
ఈ తరుణంలో ఒక ప్రముఖ ఛానల్ కి సంబంధించిన జర్నలిస్ట్ మోహన్ బాబుని అసలు ఏం జరిగింది అని అడిగే ప్రయత్నం చేశారు. తన అసహనాన్ని కోల్పోయిన మోహన్ బాబు ఆ మైకు లాక్కుని అతనిపై దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయింది. దానిపై క్షమాపణలు కూడా తెలియజేశాడు మోహన్ బాబు. అంతేకాకుండా ఆ ప్రముఖ ఛానల్ కి చెందిన వ్యక్తి తనకు బాగా తెలుసు అని చాలా సందర్భాల్లో మాట్లాడాను అని ఒక ఆడియోను రిలీజ్ చేశారు మంచు మోహన్ బాబు. ఇక మోహన్ బాబు మీద పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. గత రాత్రి నుంచి మోహన్ బాబు పరారీలో ఉన్నాడు అని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.
మోహన్ బాబు ఇంకా పరారీలోనే ఉన్నాడని టాక్. పోలీసులకు కనిపించకుండా ఉన్నాడట. ఇప్పుడు కానీ పోలీసులకు కనిపిస్తే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే, నేడు రెండో శనివారం, తర్వాత ఆదివారం… ఈ రెండు రోజులు కోర్టులు సెలవు. కాబట్టి. సోమవారం బయటికి వచ్చే ఛాన్స్ ఉందట. బయటికి వచ్చిన వెంటనే కోర్టులో పిటిషన్ వేసి, బెయిల్ తెచ్చుకోవచ్చు అని చూస్తున్నట్టు తెలుస్తుంది. మోహన్ బాబుకు బెయిల్ వచ్చే ఛాన్స్ లు కూడా ఎక్కువే. వయసు విషయాన్ని పరిగణలోకి తీసుకుని మోహన్ బాబు కు ఈజీగా బెయిల్ వస్తుంది. అని కొంతమంది అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.
Also Read : Prasanth Varma : ప్రభాస్ కథపై దృష్టి పెట్టిన ప్రశాంత్ వర్మ
ఇకపోతే లేటెస్ట్ గా వీటన్నిటి పైన అసలైన క్లారిటీ ఇచ్చారు మంచు మోహన్ బాబు. ఒక తప్పుడు ప్రచారం నా గురించి సర్కి లేట్ అవుతుంది. నేను ప్రస్తుతం మా ఇంట్లో మెడికల్ కేర్ లోనే ఉన్నాను. మీడియా వాస్తవాలను తెలుసుకొని రాయాలి అని ట్విట్టర్ వేదిక మంచు మోహన్ బాబు రిక్వెస్ట్ చేశారు.
False propaganda is being circulated.! Anticipatory bail has NOT been rejected and currently. I am under medical care in my home. I request the media to get the facts right.
— Mohan Babu M (@themohanbabu) December 14, 2024