Mushroom Benefits: మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా మార్చడంలో కూడా సహాయపడతాయి. పుట్ట గొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా గ్లూకాన్ , విటమిన్ బి, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం పుట్టగొడుగుల వినియోగం చాలా వరకూ పెరిగింది. మార్కెట్‌లో వివిధ రకాల పుట్టగొడుగులు ప్రస్తుతం లభిస్తున్నాయి.
పుట్టగొడుగులు తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పుట్ట గొడుగులు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టగొడుగుల ప్రయోజనాలు:
ఎముకలకు మేలు:
మన శరీరంలోని ఎముకలను బలోపేతం చేయడానికి పుట్టగొడుగులను ఒక ముఖ్యమైన ఆహారంగా చెప్పవచ్చు. పుట్టగొడుగులలో ఫైబర్, విటమిన్ డి, ప్రోటీన్, జింక్ , సెలీనియం పుష్కలంగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే వయస్సు పెరిగే కొద్దీ పుట్టగొడుగులను తినడం వల్ల ఎముకల బలహీనత రాకుండా ఉంటుంది. అంతే కాకుండా ఎముకల బలంగా ఉండాలంటే పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
రోగనిరోధక శక్తి:
పుట్టగొడుగులు అనేక పోషకాలకు మూలం. ఇది మన రోగనిరోధక వ్యవస్థను చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా శక్తిని కూడా అందిస్తుంది. వీటిని తరచుగా తినడం ద్వారా, మన శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు లభిస్తాయి. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దీనిని యాంటీ బాక్టీరియల్‌గా చేస్తాయి. ఫలితంగా వ్యాధులతో పోరాడడంలో మనకు సహాయపడుతుంది. తరచుగా అనారోగ్యంతో లేదా బలహీనంగా ఉండే వ్యక్తులు ఖచ్చితంగా వారి ఆహారంలో మష్రూమ్స్ చేర్చుకోవాలి.
గుండె సంబంధిత వ్యాధులు:
పుట్టగొడుగులు కార్బోహైడ్రేట్లను అలాగే చక్కెర స్థాయిలను నియంత్రించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ కారణంగా ఇది మధుమేహ రోగులకు చాలా మేలు చేస్తుంది. పుట్టగొడుగులలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. తద్వారా బరువును తగ్గడంలో కూడా సహాయపడతాయి. గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు మష్రూమ్స్ తినడం అలవాటు చేసుకోవడం మంచిది.
రక్త హీనత:
పుట్టగొడుగులలో తగినంత మొత్తంలో ఫోలిక్ ఆమ్లం, ఐరన్ ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా పుట్టగొడుగులు శరీరంలో మంటను తగ్గించడంలో, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక లక్షణాలు ఉన్నాయి.
Also Read: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు !
జీర్ణక్రియ:
జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు , అజీర్ణాన్ని నయం చేయడంలో పుట్టగొడుగు ప్రయోజనకరంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే లక్షణాలు ప్రోబయోటిక్స్‌గా పనిచేస్తాయి. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలకు సహాయపడతాయి. అంతే కాకుండా ఆహారం త్వరగా జీర్ణం అవడానికి ఉపయోగపడతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.