Tamannaah: టాలీవుడ్‌లో పెళ్లి కాని ప్రసాద్ అంటే… పాన్ ఇండియా ప్రభాస్ (Prabhas)అని అంటారు. ఎందుకంటే మొన్న, నిన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పుకున్నా.. ఇప్పుడు 45 ఏళ్లు వచ్చినా.. ఇంకా పెళ్లి కాకపోవడంతో ప్రభాస్‌ను పెళ్లి కాని ప్రసాద్ అనే అంటున్నారు. అయితే ఈ ప్రసాద్‌కి తమన్నా (Tamannaah) వల్ల ఎప్పుడో పెళ్లి కావాల్సింది. కానీ, తమన్నా చేతికి చిక్కినా… బయట పడ్డాడు. ఇలా తమన్నా చేతికి చిక్కి… రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), అల్లు అర్జున్ (Allu Arjun) పెళ్లి పీటలు ఎక్కాల్సి వచ్చింది. అయితే వీరి తమన్నా చేతికి చిక్కడం ఏంటి…? చరణ్, బన్నీ, తారక్ కు పెళ్లి కావడానికి తమన్నాకు ఏంటి సంబంధం..? ప్రభాస్ వారిలా ఎందుకు చిక్కలేదు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
తమన్నా చేతికి చిక్కి పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోలు..
అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా ఏ విషయంలో అయినా సరే కొన్ని సెంటిమెంట్లు అలా కొనసాగుతూ ఉంటాయి. అలాంటి ఎన్నో సెంటిమెంట్లలో ఇది కూడా ఒకటి అంటే తమన్నాతో ఎవరైతే నటిస్తారో వారందరికీ పెళ్లయిపోతుంది అనేది వాస్తవం. ఉదాహరణకు 2011 జూన్ 10వ తేదీన అల్లు అర్జున్ (Allu Arjun) తమన్నా కలిసి నటించిన బద్రీనాథ్ (Badrinath)సినిమా విడుదలయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే అల్లు అర్జున్ కి పెళ్లి సంబంధాలు వచ్చాయి. అలా 2011 మార్చి 6వ తేదీన అటు బద్రీనాథ్ సినిమా షూటింగ్ సెట్లో ఉండగానే.. ఇటు అల్లు అర్జున్.. స్నేహ రెడ్డి (Sneha Reddy) ని వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ (NTR)తమన్నా కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఊసరవెల్లి(Usaravelli). 2011 అక్టోబర్ 6వ తేదీన ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమా కూడా అటు తమన్నాకు మంచి ఇమేజ్ అందించింది. కాకపోతే ఇక్కడ కూడా మరో విచిత్రం ఏమిటంటే, ఊసరవెల్లి సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. మే 5వ తేదీన ఎన్టీఆర్ కి లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) తో పెద్దలు కుదిర్చిన వివాహం అయ్యింది. అయితే అటు అల్లు అర్జున్, ఇటు ఎన్టీఆర్ లకు ఒకే ఏడాదిలో తమన్నాతో సినిమాలు కుదరడం.. అదే ఏడాది వారిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడం జరిగింది.
ఇక తర్వాత ఆ జాబితాలోకి చేరిన మరో హీరో రామ్ చరణ్ (Ram Charan).. 2012 ఏప్రిల్ 5వ తేదీన రామ్ చరణ్ – తమన్నా కాంబినేషన్లో వచ్చిన ‘రచ్చ’ సినిమా విడుదలైంది. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే అంటే 2012 జూన్ 14వ తేదీన ఉపాసన, రామ్ చరణ్ ల వివాహం అత్యంత ఘనంగా జరిగింది. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిళ్లలో వీరిది కూడా ఒకటిగా నిలిచింది. ఈ ముగ్గురు కూడా తమన్నాతో సినిమా ప్రారంభం అయిన కొద్ది రోజులకే వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. అందుకే అప్పటినుంచి తమన్నాతో సినిమా అంటే కచ్చితంగా ఆ హీరోలకు పెళ్లి అయిపోతుంది అనే సెంటిమెంటు బాగా కుదిరింది.
తమన్నా సెంటిమెంట్ నుండీ ఎస్కేప్ అయిన ప్రభాస్..
అయితే ఈ సెంటిమెంట్ నుండి ప్రభాస్ ఎస్కేప్ అయ్యారనే చెప్పాలి. ఇప్పటికే తమన్నా, ప్రభాస్ కాంబినేషన్లో 2012 సెప్టెంబర్ 28న ‘రెబల్’ సినిమా విడుదల అయింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి అయిపోతుందని అందరూ అనుకున్నారు . కానీ అనూహ్యంగా ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. అలా వరుస సినిమాల కారణంగానే తమన్నా సెంటిమెంట్ నుండి ప్రభాస్ బయటపడ్డారని చెప్పవచ్చు. మొత్తానికైతే తమన్నా చేతికి చిక్కి ఆ ముగ్గురు హీరోలు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారని, ప్రభాస్ మాత్రం చక్కగా ఎస్కేప్ అయ్యారని నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.
The @tamannaahspeaks sentiment pic.twitter.com/RZN4doUlYB
— Sai (@SamanthaFreak_) March 6, 2025