BigTV English

Pushpa 2 First Review: ‘పుష్ప 2’ రివ్యూ.. యాక్షన్ సీన్స్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు.. నీయవ్వ తగ్గేదేలే..

Pushpa 2 First Review: ‘పుష్ప 2’ రివ్యూ.. యాక్షన్ సీన్స్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు.. నీయవ్వ తగ్గేదేలే..

Pushpa 2 First Review : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప మూవీ ఏ రేంజులో హిట్ టాక్ ను సొంతం చేసుకుందో మనం చూశాము.. నేషనల్ వైడ్ గా రిలీజ్ అయ్యిన ఈ మూవీ అన్ని ఏరియాల్లో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. మొదటి సినిమాలో యాక్షన్స్ సీన్స్ అదిరిపోయాయి. ఇప్పుడు అంతకు మించి యాక్షన్ సన్నివేశాలతో మూవీ రాబోతున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నాడు. సినిమా కథ సరికొత్తగా ఉండేలా పక్కా ప్లాన్ ప్రకారం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను మొదట ఆగస్టు లో రిలీజ్ చేస్తాము అన్నారు.. కొన్ని కారణాలు వల్ల సినిమా డిసెంబర్ 6 కు రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు..


ఈ సినిమాలో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపిస్తున్నాడన్నా విషయం తెలిసిందే. ఈ లుక్ కు సంబందించిన సీన్స్, పోస్టర్స్ విడుదల అయ్యాయి. ఇక పుష్ప 2 లో మాస్ జాతర అని సుకుమార్ చెబుతున్నారు. ఈ సినిమాను నవంబర్ మొదటి వారంలో షూటింగ్ పూర్తి చేసి, ప్రమోషన్స్ ను భారీగా చెయ్యనున్నట్లు సుకుమార్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ సినిమాకు పోటీగా డిసెంబర్ లో స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో సినిమా పై రోజు రోజుకి అభిమానుల ఆసక్తి పెరిగిపోతుంది. ఈ సినిమాను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని సినీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.. పుష్ప2 మూవీ రిలీజ్ కావడానికి మరో 50 రోజుల సమయం ఉంది. పుష్ప ది రూల్ ప్రమోషన్స్ విషయంలో అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నా ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే అభిప్రాయం ఫ్యాన్స్ లో ఉంది..

ఈ సినిమా షూటింగ్ ఇంకాస్త పెండింగ్ ఉంది. అప్పుడే ఫస్ట్ రివ్యూలు అని వార్త అభిమానులను నిరాశ పరుస్తున్నాయి. పుష 2 గురించి ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ కు కిక్కు ఇస్తున్నాయి. వారం రోజుల క్రితం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి రెండు సన్నివేశాలు చూశానని డిసెంబర్ లో విడుదలయ్యే పుష్ప2 మూవీ తెలుగు సినిమాల స్థాయిని మరో రేంజ్ కు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు. యాక్షన్ సీన్స్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు.. ఎస్కేఎన్ చేసిన ఈ కామెంట్లతో పుష్ప ది రూల్ మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అలాగే నిన్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఫస్టాఫ్‌ అదిరిపోతుందంటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. ఇలా ఒక్కొక్కరు రివ్యూలు ఇస్తుంటే ఫ్యాన్స్ సినిమా కోసం వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో సుకుమార్ ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు.. ఇక ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×