BigTV English

Pushpa2 Collections : ‘బాహుబలి2’ రికార్డు బ్రేక్.. పుష్పగాడి ఊచకోతకు వణుకుతున్న బాక్సాఫీస్..

Pushpa2 Collections : ‘బాహుబలి2’ రికార్డు బ్రేక్.. పుష్పగాడి ఊచకోతకు వణుకుతున్న బాక్సాఫీస్..

Pushpa2 Collections : టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. మొదటి వారంలోనే 1000 కోట్లను దాటేసి అరుదైన రికార్డులను అందుకుంది. ఇప్పుడు ఏకంగా నాలుగు వారాలు కావొస్తున్న కలెక్షన్స్ జోరు తగ్గలేదు. సీక్వెల్ మూవీలకు ఇంత కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. బాహుబలి 2 రికార్డులను పుష్ప 2 బ్రేక్ చేసేసింది. ఈ మూవీ చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్నా సినిమాకు బ్రేక్ పడలేదు.. ఇక ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబాట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..


గతంలో వచ్చిన పుష్ప మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసిందో చూసాము.. మూడేళ్ల కు సీక్వెల్‌తో ఊచకోత సృష్టిస్తున్నాడు అల్లు అర్జున్. అసలు పుష్పగాడి ఊచకోతకు ఏ రికార్డు కూడా మిగలడం లేదు. సినిమా రిలీజై నెల దగ్గరకు వస్తున్నా ఇంకా చాలా చోట్ల థియేటర్‌లు నిండుతున్నాయి. వీకెండ్ లో మాత్రమే కాదు. వీక్ డేస్ లో కూడా థియేటర్లు నిండుతున్నాయి అంటే మూవీకి ఏ మాత్రం క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.. నాలుగు వారాలుగా పుష్పగాడి సునామీ యావత్ ఇండియా థియేటర్లను ముట్టేసింది. కొత్త సినిమాలు ఎన్ని రిలీజవుతున్న పుష్ప2 దాటికి సౌండ్ కూడా వినిపించడం లేదు. ఆ ఏరియా ఈ ఏరియా అని కాకుండా.. అన్ని ఏరియాల్లో పుష్ప గాడి వీర విధ్వంసం కొనసాగుతుంది. అటు సౌత్ టు నార్త్ వరకు ఏ రికార్డును కూడా వదలడం లేదు. రప్పా రప్పా రికార్డులన్ని కోసేస్తున్నాడు.

కేవలం తెలుగు లో మాత్రమే కాదు. హిందీలో కూడా వరుసగా రికార్డులను బ్రేక్ చేసేస్తున్నాడు పుష్ప రాజ్.. వందేళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్ప2 సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇకపోతే ఈ సినిమా రూ.800 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఒక తెలుగు సినిమా హిందీలో ఈ రేంజ్‌లో ఊచకోత సృష్టించడం అంటే మాములు విషయం కాదు.. ఇదే జోరు కొనసాగితే.. ఒక్క హిందీ నుంచే రూ.1000 కోట్లు ఈజీగా కొల్లగొట్టేలానే కనిపిస్తుంది. రీసెంట్‌గా రిలీజైన బేబి జాన్ సినిమా ఎఫెక్ట్ పుష్పపై ఏమాత్రం పడలేదు.. ఇక తాజాగా ఈ సినిమా రూ.1799 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టిందని మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ తో అనౌన్స్ చేశారు.. కాగా, ఈ దెబ్బతో బాహుబలి2 రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. బాహుబలి సినిమా ఫైనల్ రన్‌లో రూ.1788 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది.. ఇక 2000 కోట్లు దాటే అవకాశాలు ఉన్నట్లు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సంధ్య థియేటర్ ఘటన కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదని తెలుస్తుంది. మొన్న మానవహక్కుల సంఘం పుష్ప 2 టీమ్ కు ఊరట కలిగించింది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×