BigTV English

Vijay Deverakonda: విజయ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. కొత్త సినిమా అప్డేట్ వచ్చిందిరో.. ఆ లుక్ చూశారా..?

Vijay Deverakonda: విజయ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. కొత్త సినిమా అప్డేట్ వచ్చిందిరో.. ఆ లుక్ చూశారా..?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. ప్రస్తుతం కింగ్డమ్ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. అంతేకాక ఎన్నో యాడ్స్ లోను నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం గౌతమ్ తిమ్మనూరి దర్శకత్వంలో కింగ్డమ్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ మే 30న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ థియేటర్లలో రాకముందే మరో మూవీని అనౌన్స్ చేశారు. తాజాగా ఈరోజు (మే 9) పుట్టినరోజు సందర్భంగా 2 కొత్త మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు.ఆ వివరాలు చూద్దాం..


కొత్త సినిమాలు లైన్ లో పెట్టిన రౌడీ హీరో ..

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మే 9 న పుట్టినరోజు సందర్భంగా, VD 14 ను ప్రకటించారు. ఈ వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఒక వీరుడి పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మే 9న రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ బాడీ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది. విజయ్ దేవరకొండ ఫేస్ చూపించకుండా వెనుక వైపు లుక్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. కండలు తిరిగిన శరీరంతో ఒక వీరుడిలా విజయ్ దేవరకొండ ధ్యానముద్రలో కూర్చొని కనిపిస్తారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఈ పోస్టర్ కి దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు యుద్ధం అతనికి లక్ష్యాన్ని ఇచ్చింది అనే క్యాప్షన్ తో రిలీజ్ చేశారు.


రౌడీ జనార్దన్ గా ..విజయ్ 

ఇదే రోజు విజయ్ దేవరకొండ మరో కొత్త మూవీ SVC59 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతుంది. ఈ మూవీ రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించారు. తాజాగా విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు.మూవీ పోస్టర్ ను రిలీజ్ చేసారు.లవ్,యాక్షన్,రొమాన్స్ తో హీరో క్యారెక్టర్ ఉంటుందని పోస్టర్ లో తెలిపారు. ఇటీవల దిల్ రాజు Ai తో విజయ్ మూవీ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. మూవీ పేరు రౌడీ జనార్దన  అని దిల్ రాజు ఈ మూవీ టైటిల్ ను లీక్ చేశాడు. వరుసగా విజయ్ దేవరకొండ నుంచి రెండు భారీ చిత్రాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయడం ఫాన్స్ లో సందడి నెలకొంది.

మరోమారు అదే డైరెక్టర్ తో ..

విజయ్ దేవరకొండ వరుస సినిమాలు లైన్ లో పెట్టేశారు. గౌతం తిన్న సూర్య దర్శకత్వంలో భాగ్యశ్రీ బోన్సే హీరోయిన్గా కింగ్డమ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. మే 30న రిలీజ్ చేయనున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న విజయ్ దేవరకొండ 14వ సినిమా గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి ఇంకా టైటిల్ ని ఖరారు చేయలేదు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో 2018 లో వచ్చిన టాక్సీవాలా చిత్రం విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో రష్మిక తో కలిసి విజయ్ దేవరకొండ నటించారు. అదే డైరెక్టర్ తో విజయ్ మరోసారి మూవీ చేయడం విశేషం. ఇక ఈ మూవీలో హీరోయిన్స్ నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన టాక్సీవాలా మూవీలో రష్మిక హీరోయిన్ గా ఉండడంతో మరోసారి అదే ఫార్ములా రిపీట్ చేస్తారా రష్మి కానీ హీరోయిన్గా సెలెక్ట్ చేస్తారా లేదంటే మరో హీరోయిన్ని సెలెక్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది.  ఇక విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ టీజర్ పాటలు ఇప్పటికే రిలీజ్ అయి మూవీపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×