BigTV English

Allu Arjun : బన్నీ ఈజ్ బ్యాక్.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

Allu Arjun : బన్నీ ఈజ్ బ్యాక్.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

Allu Arjun : మరోసారి సైలెంట్‌గా విదేశాలకు వెళ్లి వచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. చడీ చప్పుడు లేకుండా విదేశీ టూర్లు వేస్తున్నాడు బన్నీ. లేటెస్ట్‌గా దుబాయ్ (Dubai) నుంచి తిరిగి వచ్చాడు ఐకాన్ స్టార్. పుష్ప 2 వంటి సెన్సేషనల్ మూవీ తర్వాత కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ అండ్ మాస్ డైరెక్టర్ అట్లీ (Atlee)తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. ప్రస్తుతం ఈ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో.. బన్నీ టూర్ గురించి చర్చ జరుగుతునే ఉంది.


అంతా అక్కడే?

“పుష్ప 2” తర్వాత అల్లు అర్జున్ స్టార్‌డమ్ దేశవ్యాప్తంగా పెరిగింది. అట్లీతో ఈ కొత్త ప్రాజెక్ట్ అతని కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనుందని సమాచారం. అట్లీ ఈ చిత్రం కోసం రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా టాక్ ఉంది. అలాగే.. అల్లు అర్జున్ రూ. 175 కోట్లతో పాటు 15% లాభాల్లో వాటా పొందనున్నట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్ డే ఉంది. ఆ రోజు ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సమ్మర్‌లోనే రెగ్యూలర్ షూటింగ్‌కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. అయితే.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇండియాలో జరగడం లేదు. లీకేజీ సమస్యల కారణంగా దుబాయ్‌కి షిప్ట్ అయ్యారు. సినిమాకు సంబంధించిన ప్రతీ పని అంతా దుబాయ్‌లోనే చేస్తోంది అట్లీ అండ టీమ్. అందుకే.. బన్నీ కూడా ఇండియా టు దుబాయ్‌కి చక్కర్లు కొడుతున్నాడు.


తిరిగొచ్చిన ఐకాన్ స్టార్!

ఇప్పటికే అట్లీ సినిమా కోసం పలుమార్లు దుబాయ్ వెళ్లొచ్చిన అల్లు అర్జున్.. గత వారం పది రోజుల నుంచి అక్కడే ఉన్నాడు. దుబాయ్‌లో బన్నీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతునే ఉన్నాయి. ఫ్యామిలీతో కాకుండా సోలోగా వెళ్లిన బన్నీ, దుబాయ్‌లోని పలు ప్రదేశాలతో పాటు గుడులు, గోపురాలను సందర్శించారు. ఇక తాజాగా హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు బన్నీ. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. అయితే.. ఈ ట్రిప్‌ను మాత్రం సైలెంట్‌గానే కానిచ్చేశాడు బన్నీ. ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు అల్లు అభిమానులు. ఖచ్చితంగా ఆరోజు అట్లీతో సినిమాతో పాటు.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram) సినిమా నుంచి అప్డేట్ రానుందని ఆశిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా ఏమో గానీ, అట్లీ నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ రావడం మాత్రం పక్కా. మరి ఈసారి బర్త్ డేకి బన్నీ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. అలాగే.. ఇక్కడే సెలబ్రేషన్స్ చేసుకుంటాడా? లేదా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తాడా? అనేది చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×