Dirty Talk: భార్యాభర్తలు రకరకాలుగా ఉంటారు. కొంతమంది పడకగదిలో పద్ధతిగా ప్రవర్తిస్తే, మరి కొందరు డర్టీ టాక్స్ చేస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ ఆ డర్టీ టాక్ ను ఎంజాయ్ చేస్తే పర్వాలేదు. కానీ వారికి ఒకరికి నచ్చకపోయినా వారి బంధం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. మీరు మాట్లాడే మాటలను మీ భార్య లేదా భర్త ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. బెడ్ పై మీకు డర్టీ టాక్ అలవాటు ఉంటే వాటికి మీ జీవిత భాగస్వామి ఎలా ప్రతి స్పందిస్తున్నారో గమనించండి. ఆమెకు లేదా అతడికి ఆ డర్టీ టాక్ నచ్చకపోతే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఎలాంటి లక్షణాలు ద్వారా వారికి మీరు చేసే డర్టీ టాకు నచ్చడం లేదో తెలుసుకోండి.
మీరు బెడ్ పై ప్రయత్నించే కొత్త అంశాలు ఏవైనా కూడా మీ భాగస్వామి ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది ఎదుటివారు కూడా ఆస్వాదిస్తేనే మీ వైవాహిక బంధం మరింతగా బలపడుతుంది. లేకుంటే బీటలు వారే అవకాశం ఉంది. కొంతమంది భర్తలు బెడ్ పై చేరాక లైంగిక భాషలో మాట్లాడుతూ ఉంటారు. దీన్ని డర్టీ టాక్ అని పిలుచుకోవచ్చు. ఇది అందరికీ నచ్చాలని లేదు, ఆ విషయం నచ్చకపోతే జీవిత భాగస్వామిలు ఎలా ప్రవర్తిస్తారో ఇక్కడ ఇచ్చాము.
నో రియాక్షన్
మీ భాగస్వామి డర్టీ టాక్ ఇష్టపడడం లేదని చెప్పడానికి ముఖ్య లక్షణం వారు మీ మాటలకు స్పందించరు. మీరు ఎంత మాట్లాడుతున్నా వారి నుంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. అలాగే వారి సంతోషంగా కూడా కనిపించరు. అలా వారు ప్రవర్తిస్తుంటే మీరు వెంటనే మీ పద్ధతిని మార్చుకోవాలి. లేకుంటే అది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు కారణం అవుతుంది.
మీరు ఎంతగా మాట్లాడుతున్నా మీ భాగస్వామి స్పందించకుండా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వడం లేదంటే ఆమెకు ఏదో ఇబ్బందిగా ఉందని అర్థం. లైంగిక ప్రక్రియను కూడా చాలా గౌరవంగా చూడాలని వారు కోరుకుంటున్నాట్టే. కాబట్టి మీ నోట్లోంచి వచ్చే డర్టీ మాటలను ఆ క్షణమే ఆపివేస్తే అన్ని రకాలుగా మంచిది.
ప్రవర్తనలో మార్పు
ఇద్దరు వ్యక్తులు సన్నిహితంగా ఉన్న క్షణంలో ఒక వ్యక్తి డర్టీ టాక్ ప్రారంభించిన వెంటనే అవతల వ్యక్తి ప్రవర్తన మారిపోతుంది. వారు అకస్మాత్తుగా లైంగికాసక్తి కోల్పోయినట్టు ప్రవర్తిస్తారు. అంటే వారికి డర్టీ టాక్ ఇష్టపడడం లేదని మీరు అర్థం చేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడుకుంటూ పోతే మీ జీవిత భాగస్వామి మీ దగ్గరకు రావడానికి భయపడతారు.
లైంగిక ప్రక్రియలో ఆనందంగా ఉన్న భార్య లేదా భర్త ముఖ కవళికలు ఒక్కసారిగా మారిపోయినా, వారు డల్‌గా కనిపించినా మీ డర్టీ టాక్‌ను ఆపేయమని అర్థం. అలాగే ముఖం అసహ్యించుకున్నట్టు పెట్టినా కూడా వారు మీ పద్ధతిని ఇష్టపడడం లేదని గ్రహించాలి. వెంటనే మీ నోటికి తాళం వేయాల్సిందే. లేకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడేది మీరే.
మీ జీవిత భాగస్వామి లైంగికంగా మిమ్మల్ని దూరంగా పెడుతుందంటే…మీలో ఆమెకు ఏదో నచ్చని విషయం ఉందని అర్థం. ముందు ఆమెతో కూర్చొని ఏ విషయం నచ్చడం లేదో మాట్లాడండి. మీ డర్టీ టాక్ ఆమెకు నచ్చకపోతే కచ్చితంగా ఆ విషయాన్ని బయటపెడుతుంది. అప్పుడు ఆమెకు మీరే భరోసా కలిగించాలి. ఇక ఎప్పుడూ డర్టీ టాక్ జోలికి వెళ్ళనని చెప్పాలి. ఆమెకు నమ్మకం కలిగితేనే మళ్లీ మీకు చేరువవుతుంది. అలా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే.
Also Read: మా మామగారు అలాంటి పనులు చేస్తున్నారు.. మా అత్త, భర్తకు ఆ విషయం చెప్పేది ఎలా?
డర్టీ టాక్ అనేది అందరికీ నచ్చదు. కొంతమందికి మాత్రమే అది ఆస్వాదాన్ని అందిస్తుంది. మీకు నచ్చిందని… మీ జీవిత భాగస్వామికి కూడా నచ్చేలా ఆమె మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించకండి. మీ వైవాహిక జీవితం చక్కగా సాగాలంటే మీరు కూడా ఎంతో మారాల్సి రావచ్చు. మీ జీవిత భాగస్వామి కోసం మీకు నచ్చిన విషయాలను కూడా వదిలేయక తప్పదు. అప్పుడే భార్యాభర్తలు ఎక్కువ కాలం పాటు కొనసాగుతారు.