Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రీసెంట్ మూవీ పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది. ఆ మూవీతో నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ అయిన మూవీకి వరల్డ్ వైడ్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ రికార్డులను ఒక్కొక్కటిగా బ్రేక్ చేస్తూ కలెక్షన్ల సునామి సృష్టించింది. దాదాపుగా 1900 కోట్లను వసూల్ చేసింది.. నాలుగు వారాలు పూర్తి అయిన మూవీ కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. 2000 కోట్ల మార్క్ ను దాటినా ఆశ్చర్య పోనవసరం లేదని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. అయితే ఈ మూవీకి సీక్వెల్ గా మరో మూవీ రాబోతుందని మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో రీవిల్ చేశారు. కానీ బన్నీ మాత్రం షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు.. పుష్ప 3 పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ పుష్ప 3 ఉన్నట్లా? లేనట్లా? ఉంటే బన్నీ హీరోగా చెయ్యడం లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..
పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ పుష్ప 2.. డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఒకవైపు రికార్డులు వసూల్ చేసిందన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌కు తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత జరిగిన కొన్ని వ్యవహారాలతో పుష్ప సినిమా విషయంలో పెద్ద రచ్చ జరిగింది. అల్లు అర్జున్ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడు.. ఐదేళ్ల నుంచి మరో సినిమా చేయకుండా ఎంతలా సినిమాపై దృష్టి పెట్టాడు. సినిమా చూసే ఆడియన్స్‌కు అర్థమైపోతుంది. ఇక డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమా కోసం తన కెరీర్ ని పణంగా పెట్టాడు. ఊహించిన దానికన్నా ఎక్కువగానే మూవీకి రెస్పాన్స్ వచ్చింది. 2000 కోట్లకు చేరువలో ఉంది.
సంధ్య థియేటర్ ఘటన..
పుష్ప 2 భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఈ మూవీ సక్సెస్ అయ్యినందుకు అల్లు అర్జున్ కు అసలు సంతోషమే లేదు.. అందుకు కారణం ప్రీమియర్ షో టైమ్ లో సంధ్య థియేటర్ వద్దజరిగిన ఘటనే.. ఒక మహిళ ప్రాణం పోయిందని అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యింది. బెయిల్ తెచ్చుకోవడం, కోర్టుకు వెళ్లడం, వీపరీతమైన ట్రోల్స్ ఇవన్నీ పుష్ప కారణంగానే జరిగాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్.. పుష్ప విషయంలో చాలా కోపంగా ఉన్నాడని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
పుష్ప 3 పై బన్నీ షాకింగ్ రియాక్షన్..
ఇప్పటివరకు వచ్చిన పుష్ప సిరీస్ లు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు పార్ట్ 3 కూడా రాబోతుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు నిరాశ మిగిలింది. అల్లు అర్జున్ రియాక్షన్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత బన్నీ గడ్డం గాని, జుట్టుగానే కట్ చేయకపోవడంతో పార్ట్ 3 షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ.. అల్లు అర్జున్ సడన్‌గా తన లుక్‌ను మార్చేశాడు. పూర్తిగా గడ్డం, జుట్టు కట్ చేసి నయా లుక్‌లోకి వచ్చేసాడు.. అలాగే అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో కోపంలో ఉన్న బన్నీ.. సుకుమార్ బిహేవియర్‌ని కూడా చూసుకొని తను సినిమా చేయడం లేదని పుష్ప 3 ఇక లేదంటూ.. దయచేసి తనని ఫోర్స్ చేయవద్దని తెగేసి చెప్పేసాడట.. ఇక సుక్కు బుజ్జగించిన బన్నీ నో అనేశాడట.. ఇది జరిగిందన్న మాట.. బన్నీ తెలివిగా ఆలోచించాడు. పుష్ప లో తన క్యారెక్టర్ పై వ్యతిరేకత వినిపిస్తుంది.. ఇక ఇలాంటి పాత్రలు చెయ్యక పోవడమే మంచిది.. చూడాలి బన్నీ మనసు మార్చుకుంటాడేమో..