BigTV English

Allu Arjun: ఎన్నాళ్లయింది సామీ.. నీ నవ్వు చూసి.. ఫిదా అంతే

Allu Arjun: ఎన్నాళ్లయింది సామీ.. నీ నవ్వు చూసి.. ఫిదా అంతే

Allu Arjun: అల్లు అర్జున్ కు గతేడాది ఎంత కష్టకాలంగా గడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా నవ్వుకొనే పరిస్థితి లేదు. నిజం చెప్పాలంటే పుష్ప 2 అనే కాదు.. గతేడాది మొదటి నుంచి బన్నీ చుట్టూ వివాదాలు అల్లుకుంటూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో.. వైసీపీ నేతకు అండగా  నిలబడిన దగ్గర నుంచి మొదలైంది ఈ వివాదపర్వం.


సొంత మేనమామ  పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా  ఉండకుండా..  ఆయనకు అపోజిషన్ లో ఉన్న పార్టీకి బన్నీ ప్రచారం చేయడం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులనే కాదు.. మెగా- అల్లు అభిమానుల మధ్య కూడా వైరం పెంచింది. మెగా ఫ్యాన్స్ గా ఉన్న అభిమానులు.. మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ గా విడిపోయారు. ఇంకా చెప్పాలంటే బన్నీ చేసిన పని ఆయన అభిమానులకే నచ్చలేదు.  సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలా .. బన్నీని తిట్టిపోసినవారే ఉంటారు. అంతలా నెగెటివిటి తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్.

ఇంత నెగిటివిటీతో బన్నీ నటించిన పుష్ప 2 రిలీజ్ అయ్యింది. ఇంత జరిగాకా ఎవరు మాత్రం ఆ సినిమా చూస్తారు.. ? అనుకున్నారు. అందులోనూ టికెట్ రేటు  అయితే ఆకాశాన్ని తాకింది. పోయే సినిమాకు ఇంత డబ్బు పెట్టి వెళ్తారా.. ? అని అనుకున్నారు. కానీ, అంచనాలు తారుమారు అయ్యాయి. పుష్ప  మొదటి షో నుంచే  రికార్డ్ సాయి కలక్షన్స్ అందుకుంది. అంతకు మించిన భారీ విజయాన్ని అందుకొని షాక్ ఇచ్చింది.


Actress Ravali: నా కూతురు గురించి పేపర్ లో అలా వచ్చింది.. రవళి తల్లి సంచలన వ్యాఖ్యలు

సరే .. ఏదో ఒకటి నెగిటివిటీ ఉన్నా కూడా హిట్ అయ్యింది కదా.. సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకొనేలోపు.. బెన్ ఫిట్ షో వివాదం బన్నీ మెడకు చుట్టుకుంది. సంధ్యా థియేటర్ లో బెన్ ఫిట్ షో చూడడానికి వెళ్లిన బన్నీకి షాక్ తగిలింది. అక్కడ  జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రి పాలయ్యాడు. ఇక ఇదేమి తెలియనట్లు కవర్ చేసుకొని బన్నీ ఇంటికి వెళ్లి.. ఒక రెండు రోజులు సైలెంట్ గా ఉండి.. మూడోరోజు రేవతి మృతిపై  సంతాపం తెలిపాడు.

రేవతి మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు తీసుకెళ్లడంతో ఇంకాస్తా సెన్సేషన్ గా మారింది. ఇక విచారణలో తనకు  తెలిసినవన్నీ చెప్పి బయటకు వచ్చిన బన్నీ ఆగాడా .. ? అంటే అది లేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి   పోలీసులను బాధితులను చేశాడు. దీంతో మండిపడ్డ పోలీసులు బన్నీ అబద్దాలు చెప్తున్నాడు అని ఇంకోసారి  విచారణకు పిలవడం జరిగింది. అలా   కోర్టులు, కేసులు, విచారణలు, విమర్శలు, వివాదాల నడుమ బన్నీలైఫ్ సాగింది. సొంత పూచికత్తుపై కోర్టు బెయిల్ ఇస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ బయట తిరుగుతున్నాడు.

ఇక ఇప్పుడిప్పుడే  రేవతి మృతి కేసు  నుంచి బయటపడుతున్నాడు. ఈలోపు పుష్ప 2 రికార్డులు సృష్టించడం కాదు చరిత్ర సృష్టించింది. దీంతో ఇప్పటివరకు ఎలాంటి సక్సెస్ సెలబ్రేషన్స్ చేయని మేకర్స్ .. నేడు పుష్ప 2 థాంక్యూ  మీట్ ను ఏర్పాటు చేశారు. దాదాపు కొన్ని నెలల తరువాత అల్లు అర్జున్  మనస్ఫూర్తిగా నవ్వాడు. ఇందుకు సంబంధించిన  ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక బన్నీ నవ్వు చూసి.. ఎన్నాళ్లయింది సామీ.. నీ నవ్వు చూసి.. ఫిదా అంతే  అంటూ  బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×