BigTV English

IPL 2025: జెర్సీ మార్చేసిన పంజాబ్ కింగ్స్ ?

IPL 2025:  జెర్సీ మార్చేసిన పంజాబ్ కింగ్స్ ?

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కంటే… పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 17 సీజన్లు… పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గెలవలేకపోయింది పంజాబ్ కింగ్స్. అయితే ఈసారి ఎలాగైనా… కప్పు గెలవాలని పంజాబ్ కింగ్స్ ప్లాన్స్ వేస్తోంది. ఇందులో భాగంగానే ఈసారి శ్రేయస్ అయ్యర్ ను కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్… ఢిల్లీ నుంచి రిక్కి పాంటింగ్ లాంటి కీలక మెంటార్ లను తీసుకువచ్చింది. అయితే ఐపీఎల్ 2025 టోర్నమెంటులో ఎలాగైనా కప్ గెలవాలని… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది పంజాబ్ కింగ్స్. గతంలో ఉన్న జెర్సీని పక్కకు పెట్టి… వచ్చే సీజన్ లో కొత్త జెర్సీతో బరిలోకి దిగబోతుందట పంజాబ్ కింగ్స్. ఈ మేరకు తాజాగా ప్రకటన కూడా విడుదల చేసింది.


Also Read: IPL 2025: RCB కొత్త కెప్టెన్ గా ఆ డేంజర్ ఆల్ రౌండర్ ?

ఈ నేపథ్యంలోనే కొత్త జెర్సీ ధరించి పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు కూడా దర్శనమిచ్చారు. ముఖ్యంగా… ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో రాణించిన శశాంక్ సింగ్ కూడా పంజాబ్ కింగ్స్ సంబంధించిన కొత్త జెర్సీని ధరించాడు. గతంలో పంజాబ్ కింగ్స్ జెర్సీ… పూర్తిగా రెడ్ కలర్ లో ఉండేది. పంజాబ్ కింగ్స్… ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభం నుంచి అదే జెర్సీని వాడుతోంది. అయితే వచ్చే సీజన్ లో మాత్రం ఇకపై రెడ్ కలర్ జెర్సీలో పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు కనబడబోరని సమాచారం. ఇక పైన   బ్లాక్ విత్ మెరూన్… కాంబినేషన్లో… ఉన్న జెర్సీని ధరించబోతున్నారట పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు. అలాగే… చెస్ట్ దగ్గర పంజాబ్ కింగ్స్ సింబల్ మాత్రం రెడ్ కలర్ లో ఉంటుంది.


 

పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు ధరించిన కొత్త జెర్సీలో ఈ విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ కొత్త జెర్సీ కేవలం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే వేసుకుంటారని కొందరు అంటున్నారు.  మెయిన్ మ్యాచ్ లో గతంలోని రెడ్ జెర్సీ వేస్తారని సమాచారం. అయితే కొత్త జెర్సీ బాగుందని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  ఇది ఇలా ఉండగా… ఈసారి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్.. కొనసాగబోతున్నాడు. ఐపీఎల్ 2025 కు సంబంధించిన మెగా వేలంలో… భారీ ధర పెట్టి శ్రేయస్ అయ్యర్ ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. మొన్నటి మెగా వేలంలో 26.75 కోట్లతో… కేకేఆర్ కెప్టెన్ గా ఉన్న అయ్యర్ ను కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.

 

దీంతో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోనే హైయెస్ట్ ధర పలికిన రెండవ ప్లేయర్ గా శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించాడు. మొట్టమొదటి ప్లేయర్ గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్ ఏకంగా 27 కోట్లు పలికాడు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ చరిత్రలోనే హైయెస్ట్ ధర పలికిన తొలి ప్లేయర్ గా పంత్ రికార్డు లోకి ఎక్కాడు.  అయితే ఈ 18వ ఐపీఎల్ సీజన్ లో… ఎలాగైనా కప్పు గెలవాలని పంజాబ్ కింగ్స్… అన్ని స్కెచ్ లు వేస్తోంది. మరి ఈ సీజన్ లో ఆ జట్టు ప్లేయర్లు ఎలా ఆడతారో చూడాలి.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×