Allu Arjun – Trivikram : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఆయన ఆ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. 1500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందుకుంది. మరి కొద్ది రోజుల్లో 2 వేల కోట్లు ఖచ్చితంగా రాబడుతుందని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ మూవీ తర్వాత ఆయన త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి కసరత్తులు కూడా పూర్తి చేసారనే న్యూస్ ఇండస్ట్రీలో కో డై కూస్తుంది. అల్లు అర్జున్ సరసన ఏ హీరోయిన్ ను దింపుతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం….
వీరి కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా, రికార్డులు బద్దలు కొట్టాయి. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది. అల వైకుంఠపురం, సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాలు చేసి హిట్టు అందుకున్నారు. మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. వీరి కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందని అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇదే తరుణంలో ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కు జతగా వచ్చే హీరోయిన్ ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది.. అలా వైకుంఠపురంలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఉంది. ప్రస్తుతం ఆమె ఐరెన్ లెగ్ అనే టాక్ ను అందుకుంది దాంతో ఎక్కువగా సినిమాలు చెయ్యలేదు. అందుకే మరో హీరోయిన్ ను ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ అనే సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ ఇండస్ట్రీలో కూడా ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి మార్కెట్ బాగుండడంతో అల్లు అర్జున్ సరసన నటిస్తే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని మార్కెట్ బాగుంటుందని త్రివిక్రమ్ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఆమెను హీరోయిన్ గా తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా హిట్ సినిమాలు ఈమె ఖాతాలో పడుతున్నాయి. అందుకే మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. మరి అల్లు అర్జున్ సరసన ఈమె నటిస్తే మరో హిట్ పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈమె ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయి. మరి ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో చూడాలి.. ఇక ప్రస్తుతం పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. 1500 కోట్లు వసూల్ చేసింది. ఈ వికెండ్ ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ పై సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు నమోదు అయ్యి విడుదల అయ్యారు. ఆ కేసు పై విచారణ కొనసాగుతుంది. త్రివిక్రమ్ తో మూవీ రావడానికి ఆరు నెలలు పట్టే అవకాశాలు ఉన్నాయి.