Allu Arjun ..సాధారణంగా అల్లు అర్జున్ (Allu Arjun) వైరల్ వీడియోలు అంటే ఎక్కువగా ఆయన టీ షర్ట్స్, టీ షర్ట్స్ పై ఉన్న పదాలు ఎక్కువగా హైలెట్ అయ్యేవి. ముఖ్యంగా ఆయన తన బ్రాండ్ ను చూపించుకోవడానికి.. ఆ టీషర్టుల ద్వారానే ఆటిట్యూడ్ చూపిస్తున్నారు అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేసేవాళ్ళు. అంతలా టీ షర్టులతోనే నిత్యం వార్తల్లో నిలిచే అల్లు అర్జున్ ఇప్పుడు మరో వైరల్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక వైరల్ వీడియో అని చెప్పగానే ఎప్పటిలాగే టీ షర్ట్ ఉంటుంది.. ఆ టీషర్ట్ పైన ఏదో ఒక వర్డ్ ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈసారి మాత్రం వైరల్ గా మారిన వీడియోలో ప్రత్యేకించి అల్లు అర్జున్ లో ఈ విషయాలు గమనించాలి.
వైరల్ వీడియోలో ఈ విషయం గమనించారా..
అల్లు అర్జున్ ఈ వీడియోలో చాలా సన్నబడినట్టు మనం చూడవచ్చు. పైగా ఆయన పొట్ట కూడా తగ్గింది. ఎన్టీఆర్ (NTR) లాగే అల్లు అర్జున్ కూడా సడన్ గా బరువు తగ్గిపోయినట్టు మనం గమనించవచ్చు. మొత్తానికైతే అల్లు అర్జున్ కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో #AA22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ (Kalhanidhi Maran)ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం ఏకంగా రూ.250 కోట్లు ఖర్చు చేస్తుండగా.. ఒక్క అల్లు అర్జున్ కోసమే రూ.170 కోట్లు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా… ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియోని కూడా మేకర్స్ విడుదల చేశారు. అందులో అంతర్జాతీయ సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ సంస్థలను ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారు. మొత్తానికి అయితే అల్లు అర్జున్ , అట్లీ సినిమా కోసమే భారీగా బరువు తగ్గుతున్నట్లు సమాచారం.
ALSO READ:Ajaz Khan: రియాల్టీ షోలో ముద్దులు.. లో దుస్తులు విప్పే టాస్కులు.. ULLU యాప్‌పై చర్యలు?
నాటి విషయాలు పంచుకున్న అల్లు అర్జున్..
అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ఇటీవల వేవ్స్ సమ్మిట్ -2025 లో పాల్గొన్న అల్లు అర్జున్ పలు విషయాలపై కూడా స్పందించారు. ముఖ్యంగా తన మేనమామ చిరంజీవి(Chiranjeevi )తనకు స్ఫూర్తి అని, ఆయన వల్లే ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చారు. అంతేకాదు చిరంజీవి తనకు ఏ కష్టం వచ్చినా సరే అండగా నిలిచారని, ఆయన లేకపోతే తాను లేను అనే రేంజ్ లో కూడా చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ఇకపోతే సిక్స్ ప్యాక్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఒక హీరోయిన్ అవమానించడం వల్లే మనం సిక్స్ ప్యాక్ ఛాలెంజ్ తీసుకొని సాధించానని, ఇప్పుడు తనకు ఆ రికార్డు ఉందని ఇలా కొన్ని విషయాలపై కూడా ఆయన స్పందించారు. మొత్తానికైతే నాటి విషయాలను కూడా ఇప్పుడు అభిమానులతో పంచుకోవడం జరిగింది.
Nenu notice chesindhi meeru chesaara ..
(Not tshirt)
pic.twitter.com/3jZatxrxqd— ARTIST 🪓🕸️ (@krish__666) May 2, 2025