Ajaz Khan: ప్రముఖ నటుడు , హోస్ట్ అజాజ్ ఖాన్ (Ajaz Khan), నిర్మాత రాజ్ కుమార్ పాండే పై తాజాగా ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హౌజ్ అరెస్ట్ వెబ్ షో లో అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న నేపథ్యంలో వారిపై కేస్ నమోదయింది. దీంతో ఈ వెబ్ సిరీస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అజాజ్ ఖాన్ పై, ఈ వెబ్ సిరీస్ ప్రసారమవుతున్న ULLU యాప్ పై కూడా పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. భజరంగ్ దల్ కి చెందిన కార్యకర్త గౌతమ్ రవ్రియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అజాజ్ ఖాన్ పై కేస్ ఫైల్ చేశారు. ముఖ్యంగా ఈ షోలో అశ్లీల భాషలో కంటెంట్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మహిళలను కించపరిచే విధంగా దృశ్యాలు ఉన్నట్టు కూడా ఫిర్యాదులో తెలపడం జరిగింది.అంతేకాదు అనేకమంది ఈ షో కి చెందిన అశ్లీల దృశ్యాలను తమకు షేర్ చేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి కూడా పేర్కొన్నారు.
పలు సెక్షన్లపై కేస్ ఫైల్..
ఇకపోతే భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద నిర్మాత, నటులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ షో కి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షోలో పాల్గొనే కంటెస్టెంట్ లపై ఒత్తిడి చేస్తున్నట్లు సాక్షాలతో సహా దృశ్యాలు ఉన్నాయి. అంతేకాదు అటు మహిళలను కూడా ఒత్తిడి చేసే దృశ్యాలు ఆ వీడియోలు ఉండడంతో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పోటీలో పాల్గొన్న వారిని కొన్ని అసభ్యకరమైన ప్రశ్నలు కూడా వేసినట్లు, ఆ వీడియోలలో వద్దు. అందుకే ఈ వెబ్ షో ను తక్షణమే బ్యాన్ చేయాలని బిజెపి ఎమ్మెల్సీ చిత్ర వాఘా కూడా డిమాండ్ చేశారు. ఇలాంటి షో లో ఉన్న కంటెంట్ అటు సమాజంపై ఇటు పిల్లలపై ప్రభావం చూపుతుందని, అటు ఈ షోలను ప్రసారం చేసే మొబైల్ అప్లికేషన్లపై కూడా చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ఆమె కోరారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అజాజ్ ఖాన్ కెరియర్..
అజాజ్ ఖాన్ విషయానికి వస్తే.. రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత అల్లాకే బందే వంటి సినిమాలలో కూడా నటించాడు. ఆ తర్వాత పలు టెలివిజన్ షోలలో కూడా పనిచేసిన ఈయన 2013లో సల్మాన్ ఖాన్ హోస్టుగా చేసిన బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు. అంతేకాదు కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే షోలో కూడా కనిపించారు. ఇక ఈ షో వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అంతేకాదు తెలుగులో దూకుడు, నాయక్, బాద్షా వంటి చిత్రాలలో కూడా నటించారు. ఈ రియాలిటీ షోలో వెరైటీ భంగిమల్లో ముద్దులు పెట్టుకోవడాలు.. కెమేరాల ముందే అమ్మాయిలతో లో దుస్తులు తొలగించడం.. ఇలా మాటలతో చెప్పలేని జుగుప్సాకర టాస్కులు చాలానే ఉన్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉల్లూ ఆ షోను స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించక తప్పలేదు. అయితే, వెబ్ సీరిస్‌ల పేరుతో ఈ యాప్‌లో అశ్లీల కథలకు పెద్ద పీట వేస్తున్నారు. మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.
ALSO READ:Janu Lyri Missing : జాను ఎక్కడా..? సుసైడ్ స్టెట్మెంట్ తర్వాత ఏమైపోయింది..?