E chip Passport| అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్స్ లాంచ్ చేయనుంది. ఈ కొత్త టెక్నాలజీ పాస్ పోర్ట్‌లు మే 2025 నుంచి అందుబాటులోకి రానున్నాయని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో నకిలీ పాస్ పోర్ట్‌లను నివారించేందుకు, ప్రయాణ సమయంలో భద్రత, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ మెరుగుపరిచేందుకు పాస్‌పోర్ట్ లో ఈ మార్పులు చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ఐఎస్‌పి) భాగస్వామ్యంతో ఈ పాస్ పోర్ట్ లు తయారుచేయడం జరగింది.
ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏంటి?
ఈ-పాస్‌పోర్ట్ అంటే సాధారణ పాస్‌పోర్ట్ లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడి) చిప్ అమర్చి ఉంటుంది. ఈ చిప్ లోనే పాస్‌పోర్ట్ దారుని బయోమెట్రిక్ సమాచారం అంటే వేలిముద్రలు, కంటి స్కానింగ్, పేరు, చిరునామా, పుట్టిన తేదీ లాంటి వ్యక్తిగత సమాచారం మొత్తం డిజిటల్ ఫార్మాట్ లో నిల్వ అయి ఉంటుంది. దీంతో ఇకపై పాస్ పోర్ట్ లో ట్యాంపరింగ్ చేయడం, అలాంటి నకిలీ పాస్ పోర్ట్ తయారు చేయడం కష్టతరంగా మారుతుంది.
నిజానికి ఈ కొత్త టెక్నాలజీ పాస్ పోర్ట్‌లు గత సంవత్సరం అంటే ఏప్రిల్ 1, 2024నే పాస్‌పోర్ట్ సేవా ప్రొగ్రామ్ వెర్షన్ 2.0 పథకం కింద లాంచ్ చేశారు. కానీ అది పాక్షికంగానే జరిగింది. అయితే ఇప్పుడు ఈ-పాస్‌పోర్ట్ లు కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. చెన్నై, జైపూర్, హైదరాబాద్, నాగ్ పూర్, అమృత్ సర్, గోవా, రాయ్ పూర్, సూరత్, రాంచీ, భువనేశ్వర్, జమ్ము, సిమ్లా లాంటి ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయ్యాల్లో మాత్రమే జారీ చేయబడుతోంది.
తమిళ నాడులో ఇప్పటికే పూర్తి స్థాయిలో లాంచ్
తమిళనాడు రాజధాని నగరం చెన్నై నగరంలో మార్చి 3 2025న ఈ-పాస్‌పోర్ట్ లు జారీ చేయడం ప్రారంభించారు. మార్చి 3 నుంచి మార్చి 22 2025 వరకు మొత్తం 20,729 ఈ-పాస్‌పోర్ట్ లు తమిళనాడులో జారీ చేయబడ్డాయని అధికారిక సమాచారం.
Also Read: రాజస్థాన్‌లో పాక్ గూఢచారి అరెస్ట్.. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నది వారే
మెరుగైన భద్రత కోసం..
ఈ-పాస్‌పోర్ట్ లోని డేటాని ఎన్‌క్రిప్షన్ చేయడం ద్వారా భద్రంగా ఉంటుంది. సైబర్ మోసగాళ్లు ట్యాంపరింగ్ చేయకుండా డేటా ప్రైవెసీ కోసం అథెంటికేషన్ ప్రొటోకాల్స్ ఇధి పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం తెలిపింది.
ప్రయాణ సౌకర్యం కోసం..
ఈ-పాస్‌పోర్ట్‌ల ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల వేళ ఇందులో ఈ చిప్ ఉండడంతో పాస్ పోర్ట్ హోల్డర్ గుర్తింపు వెరిఫికేషన్, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. పైగా భారత పాస్‌పోర్ట్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు సమాంతరంగా ఉంటుంది.
ఈ-పాస్‌పోర్ట్ దేశవ్యాప్తంగా జారీ చేయడం అమలు అయిన తరువాత భారత దేశం.. అమెరికా, జర్మనీ, యుకె లాంటి దేశాల సరసన చేరుతుంది. ఈ దేశాలన్నీ ఇప్పటికే ప్రయాణీకులు భద్రత, సౌకర్యం కోసం ఈ-పాస్‌పోర్ట్ లు జారీ చేస్తున్నాయి.