Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏది చేసినా వివాదమే.. ఏది మాట్లాడినా విమర్శలే. ఈ ఏడాది బన్నీ బాబు జాతకం అంతగా బాలేదని చెప్పొచ్చు. ఏడాది మొదలుకొని ఒకదాని తరువాత ఒకటి వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఎలక్షన్స్ సమయంలో నంద్యాల పర్యటన ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటినుంచి బన్నీపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇంకా దాన్ని మర్చిపోనేలేదు.. తాజాగా మరో వివాదంలో బన్నీ ఇరుక్కున్నాడు.
పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన విషయం తెల్సిందే. కుటుంబంతో కలిసి పుష్ప 2 సినిమా చూడాలని థియేటర్ కు వచ్చిన రేవతి మృత్యువాత పడింది. కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇక ఈ ఘటనకు కారణం అల్లు అర్జున్ అని పోలీసులు కేసు నమోదు చేశారు. విచారం నిమిత్తం కోర్టు లో హాజరుపర్చిన బన్నీకి మధ్యంతర బెయిల్ అందడంతో జైలుకు వెళ్లకుండానే బయటకు వచ్చాడు.
Allu Arjun : మళ్ళీ దొరికేసాడు, సినిమా స్టార్టింగ్ లో బన్నీ వెళ్ళిపోయాడు అనేది అబద్ధం
ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న బన్నీపై.. నేడు అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బన్నీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఇందులో అసలు ఆరోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. అదొక యాక్సిడెంట్ అని, కావాలని ఎవరు చేసింది కాదనీ, ఇందులో ఎవరు తప్పు లేదని చెప్పుకొచ్చాడు. నేను థియేటర్లు కు వచ్చే ఆడియన్స్ ని ఆనందింప చేయాలని తపన పడుతుంటాను.. ఎవ్వరిని బ్లేమ్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు అని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రెస్ మీట్ మొత్తం తానే మాట్లాడాడు.. ముందు నుంచి కూడా మీడియాను ఎవరిని మాట్లాడనివ్వకుండా తాను మాట్లాడేది మాత్రం వినిమని కోరాడు. దీంతో మీడియా సైతం బన్నీ పూర్తిగా చెప్పేవరకు వెయిట్ చేశారు. ఆ తరువాత వారు ప్రశ్నలు అడుగుతుంటే మాత్రం బన్నీ సమాధానాలు చెప్పలేదు. “ఇంతకన్నా నేను ఏం మాట్లాడినా తప్పయిపోతుంది. కావాలంటే నా లీగల్ టీమ్ ను అడగండి. కావాలంటే మా నాన్న మాట్లాడతారు” అంటూ ఒక్క ప్రశ్న కూడా అడగనివ్వలేదు.
Allu Arjun: నేను కారులో దాక్కున్నాను.. ఆరోజు రాత్రి అసలేం ఏం జరిగిందో చెప్పిన అల్లు అర్జున్
ఇక దీంతో ఇదెక్కడి న్యాయం.. కొన్ని ప్రశ్నలకు అయినా సమాధానం చెప్పాలి కదా. 7 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి 8 గంటలకు బన్నీ వచ్చాడు. మాట్లాడొద్దు అంటే సైలెంట్ గా ఉన్నారు. కనీసం అందుకైనా చివర్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగ.. ఇలా మీడియాను పిలిచి అలా అవమానించడం పద్ధతేనా బన్నీ.. ? అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు మాత్రం బన్నీ చెప్పింది కూడా నిజమే.. అనవసరం మాట్లాడి గొడవలు పెట్టుకోవడం కన్నా.. ఇలా సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని కామెంట్స్ పెడుతున్నారు.