Allu Arjun : సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అతి త్వరగా వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమాగా ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమా సక్సెస్ ను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటూ రీసెంట్గా ప్రెస్ మీట్స్ లో పంచుకున్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో చూసిన షోవలన ఒక ఊహించని ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
అల్లు అర్జున్ కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి అనేది గుర్తించాలి. ఎందుకంటే ఒకప్పుడు ఏం మాట్లాడినా చెల్లెది కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క విషయం తప్పుగా మాట్లాడిన చాలామంది దాన్ని తప్పు అని ప్రూవ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ ని రావద్దని చెప్పినా కూడా తను వచ్చాడని, వచ్చి తనంతట తాను సినిమా చూసి వెళ్లిపోకుండా అందరికీ చేతులు ఊపుతూ పలకరించాడని, అందుకే అక్కడ ఒకసారి గా తొక్కిసలాట జరిగి ఈ దుర్ఘటన జరిగిందని కొంతమంది చెప్పుకొచ్చారు. ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, అజారుద్దీన్ లాంటివాళ్ళు కూడా అల్లు అర్జున్ పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. వీటన్నిటికీ అల్లు అర్జున్ స్పందించాడు.
Also Read : Allu Arjun : పోలీసులు నాకేం చెప్పలేదు, తప్పుడు ఆరోపణలతో నా క్యారెక్టర్ దిగజారుస్తున్నారు
ఇక అల్లు అర్జున్ మాట్లాడుతూ నేను సినిమా చూడడానికి వస్తున్నప్పుడు పోలీసులు రూట్ క్లియర్ చేస్తూ ఉంటే మాకు ప్రాపర్ గా పర్మిషన్ వచ్చింది అని తాను అనుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సినిమా మొదలైన కాసేపటికి కింద జరిగిన విషయం తనకు తెలిసి మళ్ళీ ఇష్యూ అవుతుందని తను వెళ్ళిపోయినట్లు చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ మాట్లాడుతూ సినిమా మొదలైన కాసేపటికి నేను వెళ్ళిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అల్లు అర్జున్ సినిమాలు జాతర సీను వరకు కూర్చున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాలో జాతర సీన్ దాదాపు రెండు గంటలు తర్వాత వస్తుంది. అయితే రెండు గంటల పాటు అల్లు అర్జున్ అక్కడ ఉండడం అనేది వీడియో ప్రూఫ్ ఉంది. దానిని కూడా అల్లు అర్జున్ చెప్పకుండా సినిమా మొదలైన కాసేపటికే వెళ్లిపోయాను అని చెప్పడం అబద్ధమని చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేసింది. దీంతో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజం అంటూ కొంతమంది పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.
Also Read : Allu Arjun: నేను కారులో దాక్కున్నాను.. ఆరోజు రాత్రి అసలేం ఏం జరిగిందో చెప్పిన అల్లు అర్జున్